అలస్కాలో పొంచి ఉన్న విస్ఫోటనం ముప్పు!
The threat of an eruption looming in Alaska!

జునేయి: అలస్కాలో విపత్తు ముప్పు పొంచి ఉంది. అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అలస్కాలోని అతిపెద్ద నగరమైన యాంకరేజ్ సమీపంలో మౌంట్ స్పర్ అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం శుక్రవారం అలర్ట్ జారీ చేసింది. చివరి సారిగా ఇదే పర్వతం 1992లో విస్ఫోటనం చెందింది. 19 కి.మీ. మేర దీని ప్రభావం ఏర్పడింది. ఈ ప్రాంతమంతా బూడిదలో కూరుకుపోయింది. ఉపగ్రహ డేటా విశ్లేషణ ప్రకారం అగ్నిపర్వతం బద్ధలవుతుందని శాస్ర్తవేత్తలు నిర్ధరించారు. వాయు ఉద్గారాల పెరుగుదల, భూమి పొరల్లో శిలాద్రవం ప్రవేశించడమే అగ్నివిస్ఫోటనానికి కారణం అవుతుందని వెల్లడించింది. ఇదే ప్రాంతంలో 2024లో అతితక్కువ తీవ్రత గల వంద భూకంపాలు సంభవించడం విశేషం.