స్థానిక భాషలోనే రూపాయి లోగో
స్టాలిన్ చర్యలపై మండిపడ్డ బీజేపీ

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రూపాయి లోగో చిహ్నాన్ని మార్చింది. గురువారం ఇందుకు సంబంధించిన వీడియోను ఈ రాష్ర్ట సీఎం స్టాలిన్ విడుదల చేస్తూ కేంద్రంపై విమర్శలు సంధించారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన చిత్రాన్ని రాష్ర్ట బడ్జెట్ సందర్భంగా విడుదల చేశారు.
తమిళ భాషలోనే రూపాయి లోగోను మార్చామన్నారు. హిందీ లోగోను తీసివేశామన్నారు. కాగా ఈ రూపాయి లోగోను కేంద్ర ప్రభుత్వం దేవనాగరి లిపిలో అందరి సమ్మతితో రూపొందించింది. అప్పట్లో ఈ లోగోను రూపకల్పన చేసిన వారికి బహుమతి కూడా ప్రకటించింది. అప్పట్లో అన్ని రాష్ర్టాలూ లోగోను అంగీకరించాయి. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. స్టాలిన్ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. రూపాయి లోగో హిందీ భాషతో సంబంధం లేని దేవనాగరి లిపిదని దీని అసలు చరిత్ర తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హిందీ భాషా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా స్టాలిన్ వ్యతిరేకించే చర్యల్లో ముందువరుసలో ఉంటున్నారు.