డిజిటల్ ఆర్థికం జీడీపీలో ఐదోవంతు!
డిజిటల్ ఎకానమీ 2024 నివేదిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2029–30 నాటికి ద్రవ్యోల్బణంలో (జీడీపీ)లో ఐదో వంతును అందిస్తుందని డిజిటల్ ఎకానమీ 2024 నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం.. 2022–23లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ జీడీపీలో 11.74 శాతం వాటా (31.64 లక్షల కోట్లు) ఉంది. భారత్ ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న డిజిటలైజేషన్ దేశాలలో ఉంది. రిటైల్, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా డిజిటల్ పరివర్తన వేగవంతంగా పెరుగుతోంది. ఎఐ, క్లౌడ్ షేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పెరగడం (జీసీసీ), 55 శాతం జీసీసీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం వంటివి వేగవంతమైన డిజిటల్ పరివర్తనకు ప్రధాన కారణాలు. దీంతో బహుళజాతి సంస్థలు కూడా భారత్ కు వచ్చాయి. ఈ సంస్థల ద్వారా 14.67 మిలియన్ల మందికి 58.07 శాతం మందికి ఉపాధి లభించింది. ఈ రంగంలో పురుషులతోపాటు, మహిళలు కీలకంగా రాణిస్తుండడంతో వారికి కూడా ఉపాధి అవకాశాల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. వాణిజ్య, వ్యాపారాలు పెద్ద ఎత్తున డిజిటల్ పద్ధతులలోనే పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. 95 శాతానికి పైగా బ్యాంకింగ్ చెల్లింపు లావాదేవీలు డిజిటల్ మాధ్యమంగానే ఉంటున్నాయి. విద్యారంగం కూడా ఆఫ్ లైన్, ఆన్ లైన్ మాధ్యమంగా విస్తరిస్తుంది. ఎఐ చాట్ బాట్ లు ఈ రంగంలో నూతన విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థుల సామర్థ్యం మరింతగా పెరగనుంది. లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ వంటి రంగాలు కూడా డిజిటల్ మాధ్యమంగా మారాయి. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో భారత జీడీపీలో డిజిటల్ రంగం ద్వారా ఐదోవంతు సహకారం అందనుందని నివేదిక స్పష్టం చేస్తుంది.