సునీతా, బుచ్​ లను తీసుకొచ్చే ప్రయోగం వాయిదా!

The attempt to bring back Sunita and Butch has been postponed!

Mar 13, 2025 - 17:27
 0
సునీతా, బుచ్​ లను తీసుకొచ్చే ప్రయోగం వాయిదా!

కెన్నడీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​ లను తిరిగి వెనక్కు తీసుకువచ్చేందుకు కెనడీ స్పేస్​ సెంటర్​ నుంచి చేపట్టిన నాసా స్పేస్​ ఎక్స్​ క్రూ 10 ప్రయోగం విఫలమైంది. ఈ ప్రయోగం గురువారం అర్థరాత్రి గానీ, శుక్రవారం గానీ మరోమారు నిర్వహించే అవకాశం ఉన్నట్లు నాసా తెలిపింది. సాంకేతిక కారణాల వల్లనే ప్రయోగం విఫలమైందన్నారు. ప్రయోగానికి ఇంకా 45 నిమిషాలు మిగిలి ఉండగా హైడ్రాలిక్​ వ్యవస్థలో లోపం ఉన్నట్లు గుర్తించారు. రాకెట్​, అంతరిక్ష నౌక అంతా బాగానే ఉందన్నారు. కాగా సునీతా, బుచ్​ లను తీసుకువచ్చేందుకు నలుగురు వ్యోమగాములు ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లనున్నారు. వీరు అక్కడ పని మొదలు పెట్టి చిక్కుకుపోయిన ఇద్దరినీ భూమిపైకి తిరిగి పంపనున్నారు.
ఆ నలుగురు..
– ఎనీ సి. మెకెల్లెన్​ (కమాండర్​) 2013 నుంచి నాసాలో విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా సైన్యంలో కర్నల్​ గా విధులు నిర్వహించారు. అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​ లో 58, 59 ప్రయోగాల్లో ఈమె పైలెట్​ ఇంజనీర్​ గా సేవలందించారు.
– ఓనిషి తకూయూ స్పేస్​ ఎక్స్​ 10 మిషన్​ విశ్లేషకులు. జపాన్​ స్పేస్​ ఏజెన్సీ జాక్సా అస్ర్టోనాట్​, ఫ్లైయిట్​ డైరెక్టర్​. అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​ కు సంబంధించిన 48, 49 ఆపరేషన్​ లలో తకూయూ పాల్గొన్నారు. 
– నికోల్ ఎయర్స్​ స్పేస్​ ఎక్స్​ పైలెట్​. 2021 నుంచి నాసాలో విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా వాయుసేన అకాడమీలో గ్యాడ్యుయేషన్​ సాధించారు. ఈమె తన తొలి అంతరిక్ష స్పేస్​ రాకెట్​ ను నడపనున్నారు.
– కరీల్​ పోస్కోవ్​ స్పేస్​ ఎక్స్​ 10 మిషన్​ శాస్ర్తవేత్త. రష్యాకు చెందిన ఎస్ర్టోనాట్​. తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈయన స్కైడైవింగ్​, జీరో గ్రావిటీల్లో  అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.