తొక్కిసలాట కుట్రకోణమే

The stampede is a conspiracy

Feb 6, 2025 - 13:12
 0
తొక్కిసలాట కుట్రకోణమే

50మంది అనుమానితులు ప్రయాగ్​ రాజ్​ కు ఎందుకు వచ్చారు?
హెచ్చరిక చేసినా రావడం వెనుక మర్మం ఏంటీ?
లక్షమంది డేటాను జల్లెడపడుతున్న దర్యాప్తు బృందాలు
9 రాష్ట్రాలకు ఫేస్​ రికగ్నైజేషన్​ ద్వారా గుర్తించిన ఫోటోలు, మొబైల్​ నెంబర్లు

లక్నో​: మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందనే నిర్ధారణకు, వాదనకు అతి దగ్గరగా నిఘా వర్గాలు వచ్చాయి. ఖచ్చితంగా తొక్కిసలాట పథకం ప్రకారమే జరిగినట్లుగా అనుమానిస్తున్నాయి. దర్యాప్తు బృందాల నిఘా నీడన 10వేల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరి బయో డేటాను బయటకు లాగుతున్నారు. అత్యంత గోప్యనీయంగా జరుగుతున్న విచారణ తీరును అధికారులు బయటపెట్టడం లేదు. అయితే పేరు వెల్లడించడం ఇష్టం లేని ఓ అధికారి ఎటీఎస్​, దర్యాప్తు బృందాలు సేకరిస్తున్న ఆధారాలు, వ్యక్తం చేస్తున్న అనుమానాలు, దర్యాప్తు తీరును వివరించారు. ఈయన చెప్పిన విషయాలను గమనిస్తే నిజంగానే తొక్కిసలాట వెనుక భారీ కుట్ర, అంతకుమించి సూక్ష్మమైన ప్రణాళిక ఉందని స్పష్టం అవుతుంది. 

పీఎఫ్​ ఐ సానుభూతిపరులు..
సీఎఎ, ఎన్​ ఆర్​ సీలకు వ్యతిరేకంగా యూపీ వ్యాప్తంగా చాలా ఆందోళనలు, నిరసనలు గతంలో జరిగాయి. ఈ నిరసనల్లో కరడుకట్టిన భావాలను, ఆకాంక్షలను వ్యక్తం చేసిన లక్ష మంది డేటాను ఎటీఎస్​, ఎస్టీఎఫ్​, ఎల్​ ఐయూ లాంటి నిఘా సంస్థలు గుర్తించాయి. వీరిలో హిందువులు కాని వారు (పీఎఫ్​ఐ–సానుభూతిపరులు) కూడా ఉన్నారు. ప్రయాగ్​ రాజ్​ లో జరిగే మహాకుంభమేళాకు ముందే వీరందరికి స్థానిక పోలీస్​ స్టేషన్​ ద్వారా కాశీ, ప్రయాగ్​ రాజ్​ కు రావొద్దని వార్నింగ్​ ఇచ్చారు. సరిగ్గా తొక్కిసలాటకు ముందు రోజు50 మంది  ప్రయాగ్​ రాజ్​ కు వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరంతా హిందువులు కాదు. ఇదిగో ఇదే అంశాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. వీరికి ప్రయాగ్​ రాజ్​ లో ఏం పని, ఎందుకు వచ్చారు? లాంటి అంశాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీరు మహాకుంభమేళా గురించి కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. విషయాలు బయటకు పొక్కనీయకుండా పూర్తి కుట్రను బయటపెట్టే ప్రయత్నంలో ఉండడంతో మరిన్ని వివరాలను ఆ అధికారి వెల్లడించలేదు. ఏది ఏమైనా ఈ అధికారి చెప్పిన ఈ సమాచారం చూస్తే తొక్కిసలాటలో కుట్రకోణం దాగి ఉన్నట్లు స్పష్టం అవుతుంది. 

దర్యాప్తు బృందాలు..
మహాకుంభమేళా తొక్కిసలాటపై ఇప్పటికే ఎటీఎస్​, ఎస్టీఎఫ్​, ఎల్​ ఐయూ లాంటి దర్యాప్తు బృందాలు 600 సీసీటీవల ఫుటేజీలను జల్లెడ పట్టారు. ఫేస్​ రికగ్నైషన్​ సాంకేతికతను వాడి తొక్కిసలాట ప్రాంతంలో వీరిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే వీరే తొక్కిసలాటకు కారకులా? అని గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే యూపీ వెలుపల నుంచి అంటే మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, బిహార్​, పశ్చిమ బెంగాల్​, అసోం, గుహవటి సహా తొమ్మిది రాష్ర్టాల పోలీసులకు ఫేస్​ రికగ్నైజేషన్​ ద్వారా గుర్తించిన కొంతమంది అనుమానితుల ఫోటోలు, ఆఫ్​ చేసిన ఫోన్​ నెంబర్లను పంపారు. మొత్తానికి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు తీరు అత్యంత గోప్యంగా జరుగుతుండడంతో విపక్షాలకు సైతం అంతుపట్టక మోదీ, యోగి ప్రభుత్వాలపై లేనిపోని ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నాయి.