వీసాలు ముగిసినా వెళ్లకుంటే వెనక్కుపంపుతాం
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారి జెస్సికా

అమెరికాలోనే 7వేల మంది భారత విద్యార్థులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గతేడాది చదువు పూర్తయినా ఏడువేల మంది విద్యార్థులు అక్రమంగా భారత్ లోనే ఉంటున్నారని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారి జెస్సికా ఎం వాఘన్ చెప్పారు. భారతీయులను వెనక్కు పంపడంపై ఆమె మీడియాతో గురువారం మాట్లాడారు. భారతీయుల తరువాత అత్యంత ఎక్కువ సంఖ్యలో బ్రెజిల్, చైనాకు చెందిన విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరంతా వీసాలు ముగిసినా అక్కడే తిష్టవేశారన్నారు. కాగా ఈ విద్యార్థుల్లో అత్యధికంగా పంజాబ్ కు చెందిన వారున్నారు. కాలపరిమితి ముగిసినా వీరు అమెరికాలో ఉండడం చట్టరీత్యా నేరమన్నారు. మరోవైపు చదువు పేరుతో అక్రమంగా మెక్సికో, కెనడా మార్గాల్లో అనేక మంది విద్యార్థులు ఏజెంట్ల మాటలను నమ్మి అమెరికాకు వస్తున్నారని గుర్తించామన్నారు. వీరిని ప్రస్తుతం సరిహద్దు నుంచే వెనక్కి పంపుతున్నట్లు తెలిపారు.
కొంతమంది తాత్కాలిక వీసాలపై వచ్చి ఇక్కడే ఉంటున్నారని తెలిపారు. అలాంటి వారు వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. కాగా అక్రమ మార్గాల ద్వారా వెళుతూ పట్టుబడుతున్న ఒక్కో విద్యార్థి రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తు ఏజెంట్ల వలలో పడి భవితవ్యాన్ని అగాథంలోకి నెట్టుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై ఆయా దేశాల ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మార్గం ద్వారా వచ్చే వారి వద్ద నుంచి పాస్ పోర్టులు, డబ్బులు లాక్కోవడం చేస్తున్నట్లు గుర్తించామన్నారు.