పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్త హత్య
టీఎంసీ పనేనన్న కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ కోరతామన్న బీజేపీ నాయకులు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్త మృతదేహం లభ్యమైంది. గత వారం రోజులుగా అతన్ని చంపేస్తామని టీఎంసీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బీజేపీ కార్యకర్త దీనబంధు మిద్యా మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గోరమహల్ గ్రామంలోని ఓ పొలంలో గుర్తించారు. దీంతో ఆప్రాంతంలో తీవ్ర అలజడి రేగింది.
బీజేపీ కార్యకర్త దీన్ బంధు హత్యను రాష్ర్ట అధికార పార్టీ ఖండించింది. టీఎంసీ కార్యకర్తలే హత్య చేశారని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. టీఎంసీ దుండగులే తన బిడ్డను పొట్టన బెట్టుకున్నారని తల్లి హిన్రానీ మండిపడ్డారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.