46యేళ్ల తరువాత తెరుచుకున్న దేవాలయం తలుపులు
The doors of the temple opened after 46 years
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో హింస జరిగిన ప్రాంతంలో ఉన్న దేవాలయ తలుపులను 46 యేళ్ల తరువాత తెరిచారు. ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహంతోపాటు శివలింగం ఉంది. శనివారం ఉదయం పోలీసుల సహాయంతో ఆలయ పూజారీ విష్ణు శరణ్ రస్తోగి మందిరం తలుపులు తెరిపించారు. ఆలయాన్ని శుభ్రం చేశారు. 1978లో మూతపడిన ఆలయం తిరిగి ఈ రోజు తెరుచుకోవడం సంతోషకరమన్నారు. 1978 తరువాత ఇక్కడ ఉన్న ఇల్లును అమ్మి ఖగ్గు సరాయ్ అనే ప్రాంతంలో తాము నివిస్తున్నామన్నారు. ఆలయ పోషణకు పూజారులను నియమించినా వారు ఇక్కడ ఉండేందుకు సాహసించలేదన్నారు. దీంతో ఆలయం మూతపడిందన్నారు. ఆలయం ముందు ఉన్న బావి ప్రాంతాన్ని మూసివేయడంతో పోలీసులు కూలీల సహాయంతో మట్టిని తీయించారు.
కాగా సంభాల్ మసీదు వివాదంపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న ఇళ్లకు అధికారులు కరెంట్ కనెక్షన్ ను తొలగించారన్నారు. మసీదు ప్రాంతంలో లౌడ్ స్పీకర్ల వినియోగం తనిఖీకి రాగా లోపల 59 ఫ్యాన్లు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్లు అక్రమ విద్యుత్ కనెక్షన్ తో నడుస్తున్నాయని గుర్తించామని, విద్యుత్ అధికారులకు సమాచారం అందజేశామన్నారు.