కేజ్రీపై దాడి .. ఆరోపణలు అవాస్తవం

The attack on Kejri is part of the Kutis effort

Jan 19, 2025 - 18:43
Jan 19, 2025 - 18:45
 0
కేజ్రీపై దాడి .. ఆరోపణలు అవాస్తవం

మీడియా ముందు ఆధారాలు బయటపెట్టిన పర్వేష్​ వర్మ
ఎన్నికల కమిషన్​ కు ఫిర్యాదు చేశామన్న బీజేపీ అభ్యర్థి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ అధినేత కేజ్రీవాల్​ పై దాడి చేసిన వారు స్థానిక ఓటర్లేనని, న్యూ ఢిల్లీలో 20వేల ఓట్ల తేడాతో ఓటమి ఖాయమని సర్వేలో తేలడంతో కేజ్రీవాల్​ తనపై ఆరోపణలకు దిగి లబ్ది పొందాలని భావిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ప్రర్వేష్​ వర్మ ఆరోపించారు. ఆదివారం ఆయన పలు ఆధారాలను మీడియా ముందు విడుదల చేస్తూ మాట్లాడారు. కేజ్రీవాల్​ వాల్​ కారుపై దాడికి పాల్పడింది గుండాలని ఆరోపిస్తున్నారని, ఇందులో నిజం లేదన్నారు. వారంతా స్థానిక ఓటర్లేనన్నారు. తప్పుడు కథనాలతో ఓట్లు రాబట్టుకోవాలని కుటీల యత్నాలకు తెరతీశారని మండిపడ్డారు. ఆ వాహనం స్థానిక యువకులకు ఢీ కొట్టడంతోనే వారు దాడికి పాల్పడ్డారని, దీనిపై తప్పుడు ప్రచారాలకు దిగారని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను ఎన్నికల కమిషన్​ కు అందజేసి ఫిర్యాదు చేశానని చెప్పారు. న్యూ ఢిల్లీ ఓటర్లు తన కుటుంబంలో భాగమేనన్నారు. వారిని గుండాలతో పోల్చడం సిగ్గుచేటన్నారు. వాహనంతో ఎవరినైనా గుద్దితే వారికి ఆగ్రహం వచ్చి దాడికి పాల్పడి ఉండవచ్చని అన్నారు. తప్పు మీవద్ద పెట్టుకొని ఓటర్లను గుండాలు అనడంపై మండిపడ్డారు. ఆప్​ నేతలు కేజ్రీవాల్​ పై దాడి జరిగిందని లేని పోని ఆరోపణలకు దిగుతూ విషయాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారు పూలతో స్వాగతం పలికారని వీడియోలో కనిపిస్తుందన్నారు. వీరి స్వాగతాన్ని ఆప్​ నేతలు వ్యతిరేకించడంతో వారిని పోకిరీలుగా చిత్రీకరించే యత్నానికి తెరతీశారని పర్వేష్​ వర్మ మండిపడ్డారు.