గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరిక

Terrorist conspiracy on Republic celebrations.. Alert of intelligence agencies

Jan 18, 2025 - 12:02
 0
గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరిక

పోలీసులు అప్రమత్తం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జర్మనీ తరహా వాహన ప్రమాదానికి కారణం కాగలరని కేంద్ర ఇంటలిజెన్స్​ విభాగం ప్రభుత్వానికి, పోలీసులకు హెచ్చరిక జారీ చేసింది. శనివారం జారీ చేసిన హెచ్చరికలో సంఘవిద్రోహ శక్తులు దాడికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇంటలిజెన్స్​ హెచ్చరికలతో కేంద్ర, రాష్​ర్ట ప్రభుత్వాలు, పోలీసులు అలర్ట్​ అయ్యారు. జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల కోసం ఇప్పటికే భారీ ఎత్తున రిహార్సల్స్​ జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 60 కంపెనీల పారామిలటరీ బలగాలు, పదివేల మందికిపైగా పోలీసులు, నిఘా డ్రోన్లు, సీసీ కెమెరాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు 2, 3 రోజుల ముందు నుంచే వేడుకలు నిర్వహించే ప్రాంతంలో బారికేడ్లు, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే స్థానిక ప్రాంతాల్లోని ఇళ్లు, అపార్టుమెంట్లలోని వాహనాల నెంబర్లను సైతం సేకరిస్తున్నారు. గుర్తు తెలియని వాహనాలుంటే తమకు సమాచారం అందించాలని స్థానికులకు అవగాహన కల్పించారు. అయితే ఉగ్రవాదులు దాడులకు పెద్ద వాహనాలు ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదని ఇంటలిజెన్స్​ వర్గాలు ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టారు.