గ్రీస్ అధ్యక్షుడిగా టస్సౌలాస్ ఎన్నిక!
మార్చి 13న బాధ్యతల స్వీకరణ

ఎథెన్స్: గ్రీస్ నూతన అధ్యక్షుడిగా మాజీ పార్లమెంట్ స్పీకర్ కాన్సాంటైన్ టస్సౌలాస్ (66)ఎన్నికయ్యారు. బుధవారం ఆయన ఎన్నికను గ్రీస్ పార్లమెంట్ ఆమోదించింది. టస్సౌలాస్ న్యాయవాది. గతంలో గ్రీస్ సాంస్కృతిక మంత్రి, డిప్యూటీ రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. 300 సీట్ల పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో 160 మంది ఎంపీల మద్దతు లభించడంతో ఆయన ఎన్నికకు పూర్తి మెజార్టీ లభించింది. కాగా ప్రస్తుతం గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఉన్న కాటెరినా సకెల్లారోపౌలౌ పదవీకాలం మార్చితో ముగుస్తుంది. మార్చి 13న టస్సౌలాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజకీయ అనుభవం, ఆయన స్ఫూర్తికర విధానాన్ని బట్టే టస్సౌలాస్ ను ఎన్నుకుంటామని ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ గతంలోనే చెప్పారు.