ట్రంప్ కార్యాలయంలో మస్క్ కుమారుడి చిలిపి అల్లరి
Musk's son's mischief in Trump's office

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష కార్యాలయం ఓవల్ లో ఫెడరల్ వర్క్ ఫోర్స్ ను తగ్గించే ఉత్తర్వుల విడుదల సందర్భంగా టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ తన కుమారుడితో హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ సృష్టిస్తూ విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అధ్యక్ష కార్యాలయంలో ఎలోన్ మస్క్ మీడియాతో మాట్లాడారు. అనంతరం కూడా తన చిన్ని కుమారుడు మస్క్ భుజాలపై నెక్కాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ కెన్నెడీ పనిచేస్తుండగా జూనియర్ కెన్నెడీ కూడా ఇలాగే ఆయన టేబుల్ కింద చేరి చిలిపి అల్లరి చేసేవాడు. కాగా మస్క్ కుమారుడు అల్లరి చేస్తుండగా, ట్రంప్ మాత్రం సీరియస్ గానే తన కుర్చీపై ఆసీనులయ్యారు. మీడియా ముందు తన భావాలను బయట పెట్టలేదు.