సైబర్​ నేరాలపై ఉక్కుపాదం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

Feb 12, 2025 - 18:31
 0
సైబర్​ నేరాలపై ఉక్కుపాదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన సైబర్​ భద్రత, సైబర్​ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంటరీ కన్సల్టేటివ్​ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ద్వారా మోదీ ప్రభుత్వం సైబర్ నేరాలు, సమన్వయం, కమ్యూనికేషన్, సామర్థ్య నిర్మాణం ద్వారా సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను నిర్మిస్తోందని తెలిపారు. అలాంటి ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికత ఎఐని ఉపయోగించాలని సమావేశంలో అధికారులకు సూచించారు. 1930 నెంబర్​ ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటివరకు 805 యాప్​ లు, 3,266 వెబ్​ సైట్​ లు బ్లాక్​ చేశామన్నారు. 14 సీ పోర్టల్​ లో 1.43 లక్షల ఎఫ్​ ఐఆర్​ లు నమోదు చేసినట్లు వివరించారు. సైబర్​ క్రైమ్​ వెబ్​ సైట్​ ను ఇప్పటికే 19 కోట్ల మంది ప్రజలు యాక్సెస్​ చేసుకున్నారని తెలిపారు. అదనంగా మరో 19 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించామన్నారు. ఈ ఖాతాల ద్వారా రూ 2,038 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను నిరోధించామన్నారు. గతదశాబ్ధ కాలంలో భారత్​ డిజిటల్​ విప్లవం చూసిందన్నారు. మౌలిక సదుపాయాల వేగవంతం కావడానికి కీలకభూమిక పోషించిందని చెప్పారు. సైబర్​ నేరాలకు భౌగోళిక సరిహద్దులు లేవని గుర్తుంచుకోవాలని అమిత్​ షా చెప్పారు. 2024లో యూపీఐ ద్వారా రూ. 17.221 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయన్నారు. ఇది ప్రపంచ డిజిటల్​ లావాదేవీల్లో 48 శాతం భారత్​ లోనే జరిగాయన్నారు.