18మంది ఉద్యోగులపై టిటిడీ చర్యలు

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధం 

Feb 6, 2025 - 14:00
 0
18మంది ఉద్యోగులపై టిటిడీ చర్యలు

తిరుమల: టిటిడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) హిందూ మతాన్ని ఆచరించని 18 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. గురువారం ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్​ బోర్డు వెల్లడించింది. వీరు స్వచ్ఛందంగా వీఆర్​ఎస్​ తీసుకుంటారా? లేదా వేరే విభాగాలకు పంపించాలా? అన్నది ఇంకా నిర్ణయించలేదని పేర్కొంది. టిటిడీలో 14వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ 18 మంది ఉద్యోగులు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేటతెల్లం కావడంతో చర్యలు తీసుకున్నారు. ఇక ఆలయ ట్రస్ట్​ నిర్వహించే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీరిపై హాజరు కాకుండా నిషేధం విధించారు. 

నిబంధనల ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు ఎగ్జిక్యూటివ్​ అధికారి జె. శ్యామలరావు తెలిపారు. నియమ నిబంధనల ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయంలో హిందుయేతరులు కూడా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కూడా టిటిడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో 18 మంది హిందుయేతర ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించి వీరిపై చర్యలకు ఉపక్రమించింది.