ధారవి పనుల నిలుపుదలకు సుప్రీం నో!

Supreme Court says no to halting Dharavi work!

Mar 7, 2025 - 16:12
 0
ధారవి పనుల నిలుపుదలకు సుప్రీం నో!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో అత్యంత పెద్ద మురికివాడగా పేర్కొంటున్న ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులను నిలిపివేసేందుకు సుప్రీం నిరాకరించింది. శుక్రవారం ఈ పిటిషన్​ పై న్యాయమూర్తి సీజేఐ ఖన్నా విచారణ చేపట్టారు. ముంబాయి హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు కూడా ఆయన నిరాకరించారు. అదానీ గ్రూప్​ వాదనను అంగీకరిస్తూ ఇప్పటికే ధారవి ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఇప్పటికే కూల్చివేతలు జరిగాయన్నారు. రైల్వే క్వార్టర్లను కూల్చివేశారని చెప్పారు. పిటిషన్​ లో ధారవి పునరాభివృద్ధి అదానీ ప్రాపర్టీస్​ కు ఇవ్వాలనే రాష్​ర్ట ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు సవాల్​ చేశారు. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించాలని డిమాండ్​ చేశారు. సీజేఐ పిటిషనర్​ వాదనను తిరస్కరిస్తూ మే 2025కు విచారణను వాయిదా వేశారు.