సుంకాల భయం.. దగ్గరవుతున్న చైనా
మంత్రి వాంగ్ స్నేహ గీతం

బీజింగ్: అమెరికా సుంకాల భయం అన్ని దేశాలను వేధిస్తుండగా భారత్–చైనా మధ్య మాత్రం స్నేహ హస్తాన్ని పెంపొందించేలా ఉంది. శుక్రవారం చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ.. కీలక కష్ట తరుణంలో భారత్–చైనాలు ఒకదానికొకటి మద్ధతు ఇచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యూఢిల్లీ–బీజింగ్ లు కలిసి పనిచేయడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థికంగా ఎదిగిన దేశాలేనని కలిసి పనిచేస్తే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దేశాలకు కూడా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఇరుదేశాలు ఒకరినొకరు బలహీనపరచడానికి ప్రయత్నించే సమయం కాదన్నారు. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేసే సరిహద్దు సమస్యలను నిర్వచించేందుకు అనుమతించకూడదన్నారు. ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ విదేశీ వేదికగా చైనాతో భారత్ స్థిరమైన బంధాలను కోరుకుంటుందన్నారు.