మన్మోహన్​ స్మారక చిహ్నం స్థలం.. కుటుంబం ఆమోదం

Manmohan memorial site..family approval

Mar 7, 2025 - 16:28
 0
మన్మోహన్​ స్మారక చిహ్నం స్థలం.. కుటుంబం ఆమోదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ స్మారక చిహ్నాన్ని జాతీయ స్మారక చిహ్నాంలోనే నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు హోంమంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాసి ప్రతిపాదిత స్థలాన్ని ఎన్నుకున్న విషయాన్ని శుక్రవారం తెలిపారు. ప్రణబ్​ ముఖర్జీ స్మారక చిహ్నం సమీపంలోనే  స్థలాన్ని ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన అంగీకారపత్రాన్ని కూడా సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపారు. మన్మోహన్​ స్మారక చిహ్నం నిర్మాణంపై ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ ప్రతిపాదత స్థలాలను సందర్శించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 900చ.మీ. ఈ స్థలం విస్తరించి ఉంది. స్మారక చిహ్నం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 25 లక్షల గ్రాంట్​ ను మంజూరు చేయనుంది. అంతకుముందు ఒక ట్రస్ట్​ ను ఏర్పాటు చేసి భూమిని ఆ ట్రస్ట్​ పేరు మీద బదిలీ చేస్తారు.