భారత్​–చైనా వాణిజ్యంలో బలమైన వృద్ధి

యూఎన్సీటీఎడీ నివేదికలో వెల్లడి

Mar 15, 2025 - 15:26
 0
భారత్​–చైనా వాణిజ్యంలో బలమైన వృద్ధి

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​–చైనా వాణిజ్యంలో బలమైన వృద్ధి కొనసాగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి సమావేశం (యూఎన్​సీటీఎడీ) స్పష్​టం చేసింది. 2024 నాలుగో త్రైమాసికం అక్టోబర్​–డిసెంబర్​ మధ్య నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్​ త్రైమాసికంలో 8శాతం దిగుమతి, వార్షిక దిగుమతులు ఆరు శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. వస్తువులలో త్రైమాసిక ఎగుమతి వృద్ధి విషయానికి వస్తే 7 శాతం, వార్షిక ఎగుమతి వృద్ధిని 2 శాతంగా చెప్పింది. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశం ఉందని కూడా ఈ నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వాణిజ్యం 1,200 బిలియన్​ డాలర్లు, 9 శాతం పెరిగి 2024 నాటికి 33,000 బిలియన్​ డాలర్లకు చేరుకుందని ప్రకటించింది. ముఖ్యంగా భారత్​–చైనా లో ఆశించిన దాని కంటే మెరుగైన వాణిజ్య విస్తరణ ఉందని తెలిపింది. ఇదే సమయంలో అనేక ప్రపంచదేశాల్లో వాణిజ్యం దిగజారిందని పేర్కొంది. భారత్​ లో మిశ్రమ ధోరణులు, ఎగుమతుల పెరుగుదల, దిగుమతుల్లో వృద్ధి ధోరణులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. రానున్న కాలంలో సేవా వాణిజ్య వృద్ధి బలంగా ఉంటుందని, సానుకూల ధోరణి స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది.