గ్రీస్ లో 200 భూప్రకంపనలు!
200 earthquakes in Greece!

ఏథెన్స్: గ్రీస్‌లోని శాంటోరిన్ ద్వీపంలో భూకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం నుంచి నిరంతరం చోటు చేసుకుంటున్న భూకంపాలు సోమవారం వేకువజాము వరకు కొనసాగాయి. మొత్తం స్వల్ప తీవ్రతతో 200కు పైగా భూకంపాలు మూడు రోజుల్లో వచ్చాయని అధికారులు వివరించారు. దీంతో శాంటోరిన్ లో అలర్ట్ ప్రకటించి పాఠశాలలు, కాలేజీలు, వాణిజ్య భవనాల్లో నివసించొద్దని సెలవు ప్రకటించారు. భూకంప తీవ్రత అత్యధికంగా 4.6 రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లు గుర్తించారు. ఓడరేవులకు దూరం ఉండాలని, సభలు, సమావేశాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు. గ్రీస్ లోని శాంటోరిన్ ద్వీపం సుందరమైనదిగా పేరొందింది. ఏటా ఇక్కడకు 34 లక్షల మంది వరకు పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ద్వీపంలో 20వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. భూకంపం సందర్భంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. కాగా భూమిలోపల పొరల్లోని టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికల వల్లే వరుస భూకంపాలకు కారణమని అధికారులు వివరించారు.