శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఓటర్లతోనే సాధ్యం
A vibrant democracy is only possible with voters
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రతీ ఒక్కరూ ఓటు వేసేలా భారత ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు అభినందనీయమని, ఓటర్లే దేశ శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురాగలరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిచ్చారు. దేశ భవిష్యత్ ను రూపొందించడంలో ఓట్ల ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల కమిషన్ నిరంతర కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసీఐ (భారత ఎన్నికల సంఘం) స్థాపించిన రోజే జనవరి 25న తెలిపారు. 1951–52 జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో అనేక సందేహాలు ఉండేవన్నారు. ప్రజాస్వామ్యం మనుగడపై ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవన్నారు. కాలక్రమేణా ఈసీఐ పటిష్ఠమైన చర్యలతో ప్రశ్నలకు సమాధానాలు లభించాయన్నారు. ప్రజాస్వామ్యం మరింత బలపడుతూ వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం అన్ని సందేహాలను తప్పుగా నిరూపించిందని ప్రధాని చెపారు. ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.