మరణశిక్ష పడ్డ నర్సుకు విదేశాంగ శాఖ సహాయం

ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​

Dec 31, 2024 - 12:56
 0
మరణశిక్ష పడ్డ నర్సుకు విదేశాంగ శాఖ సహాయం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యెమెన్​ లో భారతీయ నర్సుకు మరణశిక్ష విధించడం పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్​ జై స్వాల్​ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. శిక్ష రద్దు చేసేందుకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. నర్సు విషయంలో న్యాయప్రక్రియ, దౌత్యపరంగా కూడా చర్యలు చేపడతామన్నారు. నర్సు కుటుంబంతో కూడా ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిపారు. 

కేరళకు చెందిన నర్సు 2011 నుంచి యెమెన్​ లోని సనాలో పనిచేస్తుంది. 2017లో యెమెన్​ జాతీయుడి హత్యకేసులో దోషిగా నిర్దరించారు. 2018లో ఆమెకు మరణిశిక్షను విధించారు. అయితే మరో నెలరోజుల్లో ఆమెకు మరణశిక్ష అమలు కానుండడంతో విదేశాంగ శాఖ తన ప్రయత్నాలను తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది. యెమెన్​ అధ్యక్షుడు రషద్​ అల్​ అలిమి మాత్రమే మరణశిక్షను రద్దు చేసే అధికారం కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో భారత్​ దౌత్యపరంగా ఆయనతో చర్చలు జరిపే అవకాశం ఉంది.