సెర్బియా  పార్లమెంట్​ లో స్మోక్​ బాంబు దాడి

Smoke bomb attack in Serbian Parliament

Mar 4, 2025 - 18:45
 0
సెర్బియా  పార్లమెంట్​ లో స్మోక్​ బాంబు దాడి

బెల్​ గ్రేడ్​: సెర్బియా పార్లమెంట్​ లో పొగ (స్మోక్​) బాంబులు పేలాయి. మంగళవారం పార్లమెంట్​ లో చెలరేగిన అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కాస్త తీవ్ర రూపం దాల్చడంతో ప్రతిపక్ష ఎంపీలు పొగ బాంబులను విసిరాయి. సెర్బియన్​ ప్రోగ్రెసివ్​ పార్టీ నేతృత్వంలోని పాలక సంకీర్ణం సెషన్​ కోసం అజెండాను ఆమోదించిన వెంటనే ప్రతిపక్ష నేతలు స్పీకర్​ కుర్చీవైపు పరుగులు తీస్తూ పొగ గ్రేనెడ్లను విసిరారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఇద్దరు ఎంపీలకు గాయాలు కాగా, ఒక ఎంపీ జాస్మినా ఒబ్రడోవిక్​ పరిస్థితి విషమంగా ఉందని స్పీకర్​ అణా బ్రనాబిక్​ ప్రకటించారు. 2024 నవంబర్​ లో సెర్మియాలోని రెండో అతిపెద్ద నగరమైన నోవి సౌడ్​ లో రైల్వే స్టేషన్​ పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం నెపం నెడుతూ ప్రధానమంత్రి రాజీనామాకు డిమాండ్​ చేస్తున్నాయి. మంగళవారం సభలో విశ్వవిద్యాలయాలకు నిదులు, ప్రధాని మిలోస్​ రాజీనామా అంశం చర్చకు రానుండగా ఈ స్మోక్​ బాంబు దాడులతో పార్లమెంట్​ దద్దరిల్లింది.