సెమీస్​ లో కంగారు చిత్తు

Kangaroo lost in the semis

Mar 4, 2025 - 21:57
Mar 4, 2025 - 22:17
 0
సెమీస్​ లో కంగారు చిత్తు

విజృంభించిన విరాట్​ కోహ్లీ
చివరలో టెన్షన్​ తగ్గించిన పాండ్యా
బౌండరీతో విజయాన్నందించిన కెఎల్​ రాహుల్​

దుబాయ్​: దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ సెమీఫైనల్​ లో కంగారును భారత్​ చిత్తు చేసింది. దీంతో ఫైనల్​ లో బెర్త్​ ను దక్కించుకుంది. 48.1 ఓవర్లలోనే 265 పరుగులకు గాను ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ పోరు కొన సాగుతుందనుకున్న తరుణంలో హార్ధిక్​ పాండ్యా అవలీల బౌండరీలతో ఆస్ట్రేలియా బౌలర్లను కంగారెత్తించారు. మ్యాచ్​ విజయానికి మరో ఆరు పరుగులు, 13 బాల్స్​ వద్ద హార్ధిక్​ అవుట్​ అవుట్​ కాగా మరోసారి టెన్షన్​ మొదలైంది. కాగా అప్పటికే 13 బంతుల్లో ఆరు పరుగులు సాధించాల్సి ఉంది. ఈ సమయంలో రవీంద్ర జడేజా రంగంలోకి దిగి రెండు పరుగులను సాధించి కెల్​ రాహుల్​ కు బ్యాట్​ ను అందించాడు. దీంతో రాహుల్​ 6 పరుగుల బౌండరీని రాబట్టి విజయాన్ని అందించాడు. కోహ్లినే ముగిస్తాడని ఆశించినా చివరలో వెనుదిరగడంతో మ్యాచ్​ లో టెన్షన్​ పెరిగింది.  
మ్యాచ్​ విజయానికి హార్ధిక్​ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. 

దుబాయ్​ లో జరిగిన ఐసీసీ చాంపియన్స్​ ట్రోఫీ 2025లో భారత్​–ఆస్ట్రేలియాలు మంగళవారం సెమీఫైనల్​ లో తలపడ్డాయి. టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్​ ఎంచుకుంది. 49.3 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి భారత్​ కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్​ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో ఇదే అత్యధిక స్కోర్​ కావడం విశేషం. కాగా వరుణ్​ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా, శ్రేయస్​ అయ్యర్​ లు కీలక వికెట్లను సాధించి మ్యాచ్​ లో పట్టును పెంచారు. స్కోర్​ బోర్డు మరింత పరుగులు తీయకుండా కట్టడి చేయగలిగారు. 

కాగా ఈ నెల 9న దుబాయ్​ లో ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. 

ఆస్ట్రేలియా పరుగులు..
హెడ్​ 39, కూపర్​ 0, స్మిత్​ 73, లబూస్కెంజ్ 29, జోష్​ ఇంగ్లీస్​ 11, అలెక్స్​ 61, మాక్స్​ వెల్​ 7, ద్వార్​ షూయిస్​ 19, జంపా 7, నాథన్​ 10, సంగా 1(నాటౌట్​).

భారత్​ బౌలింగ్​, వికెట్లు
షమీ 10 ఓవర్లలో (3 వికెట్లు), హార్ధిక్​ పాండ్యా 5.3 (1),  కుల్​ దీప్​ యాదవ్​ 8 (0), వరుణ్​ చక్రవర్తి 10 (2), అక్షర్​ 8 (1), రవీంద్ర జడేజా (2).

భారత్​ పరుగులు..
రోహిత్​ శర్మ 28, శుబ్​ మన్​ గిల్​ 8, విరాట్​ కోహ్లీ 84, శ్రేయస్​ అయ్యర్​ 45, అక్షర్​ పటేల్​ 27, కెఎల్​ రాహుల్​ 42 నాటౌట్​, హార్దిక్​ పాండ్యా 24, రవీంద్ర జడేజా 2 నాటౌట్​. 

ఆస్ట్రేలియా వికెట్లు..
బెన్​ 1, నాథన్​ 2, కూపర్​ 1, జంపా 2 వికెట్లను సాధించారు.

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అభినందనలు..
టీమిండియా సెమీ ఫైనల్​ లో విజయం పట్ల కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత జట్టు అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిందని కొనియాడారు. విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్‌తో అదరగొట్టారన్నారు. ఫైనల్స్‌కు చేరిన భారత్​ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మెరుగైన ప్రదర్శనతో ఐసీసీ 2025 చాంపియన్​ గా నిలవాలని ఆకాంక్షించారు.