సుంకాల యుద్ధానికి సై

Sai for the tariff war

Mar 4, 2025 - 18:28
 0
సుంకాల యుద్ధానికి సై

కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాల అమలు
అమెరికాపైన సుంకాలు విధింపు
ట్రంప్​ కు భారీ ఝలక్​ ఇచ్చిన డ్రాగన్​ కంట్రీ
అనాలోచిత నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పే

వాషింగ్టన్​: అమెరికాపై కెనడా, మెక్సికో, చైనా సుంకాల కత్తి వేలాడుతుండగా,  ఈ దేశాలపై ట్రంప్​ పన్ను కత్తి వేలాడుతుంది. ట్రంప్​ దుందుడుకు, అనాలోచిత పన్ను పెంపు నిర్ణయాలు ఆ దేశాన్ని ఆర్థిక అగాధంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. అమెరికా ఈ దేశాలపై విధించిన సుంకాల వర్తింపు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. సరిహద్దు వివాదాలు, డ్రగ్స్​ సరఫరా, పలు రకాల ఉత్ర్పేరకాల సరఫరాతో ఏటా అమెరికాలో 75వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్​ సుంకాల విధింపులో వెనుక్కు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ సుంకాల ప్రకటనపై కట్టుబడి ఉన్నారు. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై కూడా సుంకాల భారాన్ని ట్రంప్​ మోపారు.  కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం నుంచి 20 శాతానికి సుంకాలను పెంచారు. ట్రంప్​ ప్రకటనతో ఒక్కసారిగా ఈ దేశాల స్టాక్​ మార్కెట్లు నేలచూపులు చూశాయి. ముఖ్యంగా అమెరికన్​ స్టాక్​ మార్కెట్​ కూడా 2శాతం మేర దిగజారడం గమనార్హం. అమెరికాకు చెందిన దిగుమతులపైన తాము 25 శాతం సుంకాలు విధిస్తామని కెనడా ప్రాని జస్టిన్​ ట్రూడో నిర్ణయించారు. 30 బిలియన్ల విలువైన దిగుమతుతులపై మంగళవారం నుంచే సుంకాలు విధింపు అమల్లోకి వస్తుందన్నారు. ఇకపై అమెరికన్​ దిగుమతులపై యథాతథంగా సుంకాలు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. 

ట్రంప్​ కు డ్రాగన్​ ఝలక్​! ..
మరోవైపు ట్రంప్​ నిర్ణయంతో ఆగ్రహంతో ఉన్న చైనా (డ్రాగన్​) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో 10 నుంచి 15 శాతం వరకు అమెరికన్​ ఉత్పత్తులపై 10 నుంచి 1 5 శాతం సుంకాలు విధిస్తున్నట్లు మార్చి 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని వివరించింది. చైనా ఉత్పత్తులపై 20 శాతం సుంకం విధించడం పట్ల చైనా ప్రతిస్పందనగా ఈ చర్యకు దిగింది. అమెరికాలో పండించే చికెన్​, గోధుమ, మొక్కజొన్న, పత్తి దిగుమతులపై 15 శాతం, జొన్నలు, సోయాబీన్స్, పంది మాంసం, సముద్ర ఆహారం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం పెంచనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఆర్థిక పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. మరింత దిగజారేలా కనిపిస్తుంది.