బిష్ణోయ్ గ్యాంగ్ ఏడుగురు షూటర్ల అరెస్ట్
Seven shooters of Bishnoi gang arrested
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన ఏడుగురు షార్ప్ షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఢిల్లీ స్పెషల్ పోలీసు బృందాలు శుక్రవారం పంజాబ్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. సిద్ధికీ హత్య కేసులో వీరంతా నిందితులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బిష్ణోయ్ గ్యాంగ్ పై ఎన్ ఐఏ ఉక్కుపాదం మోపుతోంది. లారెన్స్ సోదరుడు అన్మోల్ ఆచూకి తెలిపితే రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది. పంజాబ్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో ఇతను ప్రధాన నిందితుడు. ఇతనిపై కూడా 18 కేసులున్నాయి. ఇతను ఆఖరు సారిగా కెనడా, కెన్యాలలో ఉన్నట్లు ఎన్ ఐఎ గుర్తించింది. 2021లో బెయిల్ పై విడుదలయ్యాక మళ్లీ నేరజీవితాన్ని ప్రారంభించాడు. బిష్ణోయ్ గ్యాంగ్ కు ప్రధాన సూత్రధారి కూడా ఇతడే అని పోలీసులు గుర్తించారు. బాబా సిద్దిఖీ హత్యలో కూడా ఇతని హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కాల్పులు జరిపే ముందు స్నాప్ చాట ద్వారా అన్మోల్ బిష్ణోయ్ తో మాట్లాడినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాగా సిద్దిఖీ హత్యలో ఇప్పటివరకు ముంబాయి క్రైమ్ బ్రాంచ్ 11 మందిని అరెస్టు చేసింది.