బాగ్ పాత్ లో ఫ్లాట్ ఫామ్ కూలి ఏడుగురు మృతి
80మందికి తీవ్ర గాయాలు

లక్నో: యూపీలోని బాగ్ పత్ నగరం బరౌత్ లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జైన సంఘం నిర్వాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఏర్పాట చేసిన 65 అడుగుల ఎత్తున్న ఫ్లాట్ ఫారమ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, అధికార యంత్రాంగం, మహోత్సవ నిర్వాహకులు గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఫ్లాట్ ఫారమ్ పై భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ తాత్కాలిక నిర్మాణం కూలిపోయింది. దీంతో స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య జరిగింది. ఆదినాథున్ని దర్శించుకునేందుకు ఒకేసారి భక్తులు ఈ తాత్కాలిక నిర్మాణంపై చేరుకోవడంతో బరువును తట్టుకోలేక కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.