ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం

Rekha Gupta sworn in as Delhi CM

Feb 20, 2025 - 13:10
 0
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా గురువారం రాంలీలా మైదానం ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఆరుగురు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు కూడా పాల్గొన్నారు. వీరితోబాటు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు,ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులుగా ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. 

ప్రమాణ స్వీకారానికి ముందు రేఖ గుప్తా గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తనపై బీజేపీ అధిష్ఠానం చాలా పెద్ద బాధ్యతను ఉంచిందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీకి, పార్టీ హైకమాండ్‌కు రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను కేజ్రీవాల్​ శీష్​ మహల్​ లో నివసించబోనన్నారు.

ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన రేఖా గుప్తా ముందుగా ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి విచ్చేశారు. ఇక్కడ ఆమెకు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.