పార్లమెంట్​ లో 74మంది మహిళా ఎంపీల ప్రాతినిధ్యం

Representation of 74 women MPs in Parliament

Feb 13, 2025 - 16:01
 0
పార్లమెంట్​ లో 74మంది మహిళా ఎంపీల ప్రాతినిధ్యం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: పార్లమెంట్​ లో అత్యధికంగా మహిళల ప్రాతినిధ్యం రాష్​ర్టం పశ్చిమ బెంగాల్​ అని ఎన్నికల కమిషన్​ గురువారం  నివేదిక వెల్లడించింది. 543 ఎంపీలకు గాను 74 మంది మహిళా ఎంపీలు పార్లమెంట్​ లో భాగస్వాములయ్యారు. వీరిలో పశ్చిమ బెంగాల్​ నుంచి 11 మంది, పురుష ఎంపీల విషయానికి వస్తే అత్యధికంగా యూపీ నుంచి 73 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  కాగా రాష్​ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల రాజకీయాలలో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతుంది. త్రిపుర, దాద్రానగర్​ హవేలి, డామన్​, డయ్యూ ప్రాంతాలలో 50 శాతానికి మహిళల పాత్ర చేరుకుంది. ఢిల్లీలో 28.6 శాతం, చత్తీస్​ గఢ్​ లో 27.3 శాతం, పశ్చిమ బెంగాల్​ లో 26. 2శాతంగా రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా ఓట్లు వేయడంలోనూ మహిళలే ముందువరుసలో ఉన్నారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో 65.78 శాతం మహిళా ఓట్లు పోలైతే, 65.55 శాతం పురుషుల ఓట్లు పోలయ్యాయి. 0.23 శాతం ఎక్కువగా మహిళలు ఓటింగ్​ లో పాల్గొన్నారు.