వెస్ బ్యాంక్ లో ఐడీఎఫ్ దాడులు 10మంది మృతి
40 మందికి గాయాలు

జెరూసలెం: ఐడీఎఫ్ వెస్ట్ బ్యాంక్ లో భారీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో పదిమంది పాలస్తీనియన్లు మృతి చెందారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఈ దాడి జరగడం పట్ల అంతర్జాతీయ సమాజం ఉలిక్కి పడింది. మంగళవారం ఈ దాడి జరిగినట్లుగా బుధవారం వెస్ట్ బ్యాంక్ అధికారులు ప్రకటించారు. దాడిలో గాయపడ్డ 40మంది వైద్య సేవలకు ప్రతిబంధకాలను ఐడీఎఫ్ సృష్టిస్తోందని ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. దాడి తరువాత ఐడీఎఫ్ చర్యలపై పాలస్తీయన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగా మృతుల్లో ఓ బాలుడు కూడా ఉండడంతో స్థానికులు భారీ ఎత్తున ఐడీఎఫ్ సైన్యం చర్యలపై నిరసన చేపట్టారు. కాగా ఐడీఎఫ్ వరుస దాడులు ఇంటలిజెన్స్ సమాచారంతోనే జరిగినట్లుగా ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని ఇవి భవిష్యత్ లో ఇజ్రాయెల్ కు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉన్నందున తాము ఉపేక్షించేది లేదని ఐడీఎఫ్ తేల్చి చెప్పింది. ఐడీఎఫ్ దాడి నిర్వహించిన జెనిన్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం పాలస్తీనా సాయుధ సమూహాలకు బలమైన కోటగా పరిగణించబడుతుంది.