ఆప్​ సత్యేంద్ర జైన్​ ప్రాసిక్యూషన్​ కు రాష్ట్రపతి ఆమోదం

President approves AAP's Satyendra Jain prosecution

Feb 18, 2025 - 16:44
 0
ఆప్​ సత్యేంద్ర జైన్​ ప్రాసిక్యూషన్​ కు రాష్ట్రపతి ఆమోదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మనీలాండరింగ్​ కేసులో ఆప్​ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​ ప్రాసిక్యూట్​ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నుంచి ఆమోదం లభించిందని ఈడీ మంగళవారం వెల్లడించింది. బీఎన్​ ఎస్​ సెక్షన్​ 218 కింద కోర్టులో ప్రాసిక్యూట్​ చేయడానికి అనుమతించాలని ఇటీవలే హోంశాఖరాష్ట్రపతిని లిఖిత పూర్వకంగా కోరింది. తగిన ఆధారాలు లభించాయని, విచారణ, ప్రాసిక్యూషన్​ కు అనుమతించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదం కోరారు. ఆమోదం లభించడంతో సత్యేంద్రజైన్​ చుట్టూ ఉచ్చు మరింత బిగించుకోనుంది. మద్యం కుంభకోణంలో సత్యేంద్ర జైన్​ ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. సుకేశ్​ చంద్రశేఖర్​ అనే నిందితుని ద్వారా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.