అగస్టా వెస్ట్​ ల్యాండ్​ నిందితుడికి బెయిల్​

Bail for Augusta Westland accused

Feb 18, 2025 - 16:11
 0
అగస్టా వెస్ట్​ ల్యాండ్​ నిందితుడికి బెయిల్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అగస్టా వెస్ట్​ ల్యాండ్​ కుంభకోణంలో నిందితుడు క్రిస్టియన్​ మైఖేల్​ కు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు మంగళవారం అతనికి బెయిల్​ మంజూరు చేసింది. రూ. 3600 కోట్ల విలువైన 12 హెలికాప్టర్ల కొనుగోలులో అతని పాత్రప సీబీఐ,ఈడీలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. 2018లో అతన్ని దుబాయ్​ నుంచి భారత్​ కు రప్పించి అరెస్ట్​ చేశాయి. మైఖేల్​ బ్రిటిష్​ పౌరుడు. ఇప్పటికే జేమ్స్​ ఆరు సంవత్సరాలుగా కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ట్రయల్​ కోర్టు విధించిన షరతులకు లోబడి జేమ్స్​ బెయిల్​ పై విడుదలవుతారని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్​ చేస్తూ జేమ్స్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు సుప్రీంకోర్టు కూడా ఇతని బెయిల్​ ను నిరాకరించింది.