పిట్రోడా వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం

CM angry over Pitroda's comments

Feb 18, 2025 - 16:57
 0
పిట్రోడా వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం

రాయ్​ పూర్​: చైనాపై కాంగ్రెస్​ నేత శ్యామ్​ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై చత్తీస్​ గఢ్​ సీఎం విష్ణు దేవ్​ సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వేర్పాటువాదులు, దేశ శత్రువులతో కాంగ్రెస్​ నేరుగా చేతులు కలిపిందనడానికి పిట్రోడా వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. పిట్రోడాను కాంగ్రెస్​ బహిష్కరిస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ దేశ శత్రువులతో కలిసి దేశాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు పన్నిందనడానికి పిట్రోడా వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయమని ప్రకటించడం కాంగ్రెస్​ పార్టీ ప్రణాళికలో భాగమేనన్నారు.