హమాస్ ను అక్కున చేర్చుకున్న పాక్
Pakistan has joined Hamas

పీవోకేలోకి ప్రవేశం
భారత్ అప్రమత్తం
పూలదండలతో స్వాగతాలు
ఇస్లామాబాద్: ఇప్పటికే ఉన్న ఉగ్రవాదులతో పీకల్లోతూ కష్టాల్లోకి జారుకున్న పాకిస్థాన్ మరో కొత్త ఆపదను తన ఇంట్లోకి ఆహ్వానించింది. హమాస్ నాయకులకు విఐపీ ట్రీట్ మెంట్ తో పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)కు పంపుతోంది. దీంతో పెద్ద ఎత్తున హమాస్ ఉగ్ర సంస్థ నాయకులు, ఉగ్రవాదులు పీవోకేకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే పలుమార్లు పీవోకే భారత్ లో అంతర్భాగమేనని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో పాక్ ఈ డబుల్ గేమ్ కు తెరతీసింది. గురువారం పెద్ద ఎత్తున పాక్ హమాస్ నాయకులకు బహిరంగ సభలు ఏర్పాటు చేసి పూలదండలతో స్వాగతం పలికింది. వీరంతా రావల్కోట్ లోని షహీద్ సబీర్ స్టేడియంకు ఎస్ యూవీ లగ్జరీ వాహనాల్లో చేరుకున్నారు. హమాస్ ఉగ్ర సంస్థకు జైష్ ఎ మహమ్మద్, లష్కరే తోయిబాలు ఘనంగా స్వాగతం పలుకుతుంటే పాక్ ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 7 ఇజ్రాయెల్ పై దాడి అనంతరం ఇజ్రాయెల్ గాజా, పాలస్తీనా, లెబనాన్ లపై విరుచుకుపడుతూ హమాస్ జాడలేకుండా చేయడంతో పాక్ వారికి పీవోకేలో ఆశ్రయం కల్పించడం విశేషం.