భోపాల్ ఆప్ కార్యాలయానికి తాళం
అద్దె చెల్లించడం లేదని యజమాని ఆరోపణ

భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఆప్ కార్యాలయానికి తాళం పడింది. రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యాజమాని శనివారం ఉదయం ఆప్ కార్యాలయానికి తాళం వేశాడు. ఎన్నిసార్లు అడిగినా అద్దె చెల్లించడం లేదన్నాడు. అందుకే తాళం వేయక తప్పలేదన్నారు. రూ. 50వేలు ఇవ్వాల్సి ఉందన్నాడు. అంతేగాక పార్టీ కార్యాలయం అని చెప్పి అద్దెకు తీసుకొని ఇందులో మద్యం సీసాల పెటెలు తీసుకువచ్చి పెడుతున్నారని ఆరోపించారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకుండా తనను భయపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు యజమాని మీడియా వద్ద వాపోయారు. కాగా అద్దె విషయమై ఆప్ రాష్ర్ట అధ్యక్షురాలు రాణి అగర్వాల్ మాట్లాడుతూ.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నారు. విషయంపై ఆరా తీసి యాజమానికి అద్దె చెల్లించే చర్యలు తీసుకుంటానని చెప్పారు. అక్కడే ఆప్ కార్యాలయం కొనసాగుతుందన్నారు.