బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తి
Bullet train project completed

కొనసాగుతున్న సముద్రగర్భం సొరంగం పనులు
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
అహ్మాదాబాద్: 360 కి.మీ. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయిందని, సముద్రగర్భం సొరంగం పనులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అవ్వినీ వైష్ణవ్ తెలిపారు. శనివారం అహ్మాదాబాద్ రైల్వే స్టేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అనుమతి ఆలస్యం కారణంగా ప్రాజెక్టు పనులు రెండేళ్లు ఆలస్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు పరిష్కారం లభించిందని తెలిపారు. బుల్లెట్ ప్రాజెక్టు సముద్ర గర్భంలో రెండు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికతతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల లక్ష మందికి ఉపాధి లభించిందన్నారు. గుజరాత్ లో పనులు వేగంగా కొనసాగినా, మహారాష్ర్టలోనే భూసేకరణలో జాప్యం జరిగిందన్నారు. 40 మీటర్ల వంతెనను కేవలం 16 గంటల్లోనే పూర్తి చేయడం అధికారులు, కార్మికుల సామర్థ్యాన్ని సూచిస్తున్నాయని ప్రశంసించారు. బుల్లెట్ రైలు భారత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని చెప్పారు. ఎంఎహెచ్ ఎస్ ఆర్ ప్రాజెక్టు ముంబై, సూరత్, వడోదర, అహ్మాదాబాద్ లను అనుసంధానించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 1.08 లక్షల కోట్లు.