అంతరిక్షంలో రష్యా సహకారం ప్రశంసనీయం

Russia's contribution to space is commendable

Mar 1, 2025 - 17:40
 0
అంతరిక్షంలో రష్యా సహకారం ప్రశంసనీయం

ప్రధానిని కలిసి రష్యన్​ వ్యోమగామి ఒలేగ్​ 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనలో రష్యా సహకారం ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శనివారం న్యూ ఢిల్లీలో జరిగిన ఎన్​ ఎక్స్​ టీ సమావేశంలో రష్యన్​ వ్యోమగామి ఒలేగ్​ ఆర్టెమియేవ్​ ప్రధాని మోదీని కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత్​–రష్యా​ జెండాలు ఉన్న మెమోంటో, శాస్త్రవేత్త కాన్సాంఇన్​ సియోల్కోవ్స్కీ రాసిన ఆన్​ ది మూన్​ అనే పుస్తకాన్ని కూడా బహూకరించారు. ఆర్టటెమియేవ్​ అంతరిక్ష రంగంలో చేపట్టిన మూడు మిషన్లలో 560 రోజులు, 18 గంటల, 17 నిమిషాలు గడిపాడు. 1984 నుంచి భారత–రష్యా అంతరిక్ష రంగం  సహకారం మొదలైంది.