2027లో చంద్రయాన్​–4

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​

Feb 6, 2025 - 15:47
 0
2027లో చంద్రయాన్​–4

2026లో గగన్​ యాన్​
2035లో భారత అంతరిక్ష కేంద్రం
2040లో చంద్రుడిపైకి భారతీయుడు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ చంద్రయాన్​–4 మిషన్​ ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్​ వెల్లడించారు. గురువారం ఆయన చంద్రయాన్​–4 మిషన్​ గురించిన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ మిషన్​ భారత్​ కు అత్యంత కీలకమైందన్నారు. ఈ మిషన్​ ద్వారా చంద్రుడిపై ఉన్న పలు రకాల అవశేషాలను భూమిపైకి తీసుకువస్తామని తెలిపారు. ఎల్​ వీఎం –3 ద్వారా ప్రయోగిస్తామని తెలిపారు. గగన్​ యాన్​ మిషన్​ లో భారత వ్యోమగాములను అంతరిక్ష నౌకలో భూమి దిగువ కక్ష్య (సముద్రంలోకి)కు పంపించి సురక్షితంగా తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఈ మిషన్​ 2026లో చేపడతామన్నారు. గత సంవత్సరం చంద్రయాన్​–4 మిషన్​ ను ప్రధాని మోదీ మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఈ మిషన్​ ను 36 నెలల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ మిషన్​ కోసం రూ. 2104.06 కోట్లను అందించామన్నారు. చంద్రయాన్​ 4 రెండు దఫాల ప్రయోగం చేపడతామన్నారు. మాడ్యూల్​, డాకింగ్​ లాంటి ప్రక్రియలు ఇందులో ఉంటాయన్నారు. 2035లో భారత అంతరిక్ష కేంద్రం, 2040లో చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ స్పష్టం చేశారు.