ఒలింపిక్స్–2024 హాకీ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటన
ఒలింపిక్స్ – 2024 కోసం భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒలింపిక్స్ – 2024 కోసం భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ పూల్ బిలో చోటు దక్కించుకుంది. భారత పురుషుల హాకీ జట్టు జూలై 27న పారిస్ ఒలింపిక్స్‌లో తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత జూలై 29న అర్జెంటీనాతో, 30న ఐర్లాండ్‌తో, ఆగస్టు 1న బెల్జియంతో, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో తలపడనుంది. నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, దక్షిణాఫ్రికా పూల్-ఎలో చోటు దక్కించుకున్నాయి. ఆగస్టు 4న క్వార్టర్ ఫైనల్స్, ఆగస్టు 6న సెమీఫైనల్స్ జరగనున్నాయి. కాంస్య పతకానికి సంబంధించిన ప్లే ఆఫ్, ఫైనల్ ఆగస్టు 8న జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కొలంబస్‌లోని వైవ్స్ -డు-మెనోయిర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అదే సమయంలో పురుషుల విభాగంలో బెల్జియం డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్ఆగస్టు 11వరకు కొనసాగనుంది.