ఇందిరమ్మ కాదు...తెలంగాణలో రెడ్ల పాలన

ఎమ్మార్పీఎస్​ చీఫ్ ​మంద కృష్ణ మాదిగ రేవంత్​ అంచెలంచెలుగా ఎదిగేందుకు మాదిగల తోడ్పాటు సీఎం క్యాబినెట్​లో ఏకంగా నలుగురు రెడ్లకు ప్రాధాన్యం నామినేటెడ్​ పదవుల్లోనూ మాదిగలకు అన్యాయమే

Mar 23, 2024 - 20:05
Mar 23, 2024 - 20:05
 0
ఇందిరమ్మ కాదు...తెలంగాణలో రెడ్ల పాలన

నా తెలంగాణ, హైదరాబాద్:  తెలంగాణలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన కాదని, రెడ్ల పాలన నడుస్తొందని మందకృష్ణ మాదిగ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తాను జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థాయి వరకు గెలవడానికి తన సొంత కులమైన రెడ్ల కంటే మాదిగలే కారణమని చెప్పారని, మరి మాదిగల అండతోనే ముఖ్యమంత్రి అయన రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో నలుగురు రెడ్లకు చోటు దక్కిందని, మాదిగలు కేవలం ఒక్కరే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. నామినేటేడ్ పదవుల్లో 12 మందిని రెడ్లను తీసుకొన్నా ఒక్కటి మాత్రమే మాదిగలకు ఇవ్వడం అంతే అణిచివేత కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండే చెప్పానని, ఇలాంటివి చాలా ఉన్నాయని, వీటి గురించి త్వరలోనే మాట్లాడతానని చెప్పారు. తెలంగాణలో ముమ్మాటికి రెడ్ల పాలనే నడుస్తోందని, ఇందిరమ్మ పాలనో, ప్రజాపాలన కాదని చెప్పుకొచ్చారు.