రాహుల్ గాంధీపై నాన్​ బెయిలబుల్​ ఎఫ్​ ఐఆర్​ నమోదు!

Non-bailable FIR registered against Rahul Gandhi!

Jan 19, 2025 - 16:01
 0
రాహుల్ గాంధీపై నాన్​ బెయిలబుల్​ ఎఫ్​ ఐఆర్​ నమోదు!

డిస్ఫూర్​: రాహుల్​ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై అసోంలో నాన్​ బెయిలబుల్​ ఎఫ్​ ఐఆర్​ నమోదైందని గౌహాతి హైకోర్టు న్యాయవాది మోంజీత్​ చెటియా ఆదివారం తెలిపారు. శనివారం గౌహాతిలోని పాన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ లో నమోదైందన్నారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించేలా రాహుల్​ గాంధీ వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఎన్​ఎస్​ సెక్షన్​ 52 కింద నాన్​ బెయిలబుల్​ ఎఫ్​ ఐఆర్​ నమోదైందన్నారు. రాహుల్​ బెయిల్​ కోసం నేరుగా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్​ నూతన జాతీయ కార్యాలయ భవనం ప్రారంభం అనంతరం రాహుల్​ గాంధీ ఆర్​ఎస్​ఎస్​, బీజేపీపై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు. ఆర్​ ఎస్​ ఎస్​ ప్రతి సంస్థను స్వాధీనం చేసుకుంటున్నాయని రాహుల్​ విమర్శించారు. పదేపదే కాంగ్రెస్​ పార్టీ ఓటమితో రాహుల్​ తీవ్ర నిర్వేదంలో  ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, శాంతి, సుస్థిరతలను, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది వ్యాఖ్యానించారు.