పుట్టిన బిడ్డపై అప్పా!

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jan 19, 2025 - 15:34
 0
పుట్టిన బిడ్డపై అప్పా!

బీఆర్​ఎస్​, హస్తంపై గరం గరం
అవినీతి, కుటుంబ పార్టీలే
రాజ్యాంగాధినేతలను గౌరవించుకోలేదు
అంబేద్కర్​, పీవీలను అవమానించారు
హామీల అమలులో పూర్తిగా విఫలం
సమాధానం చెప్పే తెలంగాణలో రాహుల్​ అడుగు పెట్టాలి

నా తెలంగాణ, హైదరాబాద్​: బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీ అవినీతి, కుటుంబ విధానాలపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో పుట్టన బిడ్డపై కూడా అప్పులే మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్​, పీవీ నరసింహారావుల అంత్యక్రియలు కూడా ఢిల్లీలో నిర్వహించిన పార్టీ కాంగ్రెస్​ అన్నారు. అధికారంలోకి వచ్చే ముందు ఆరుగ్యారంటీల అమలు హామీపై సమాధానం చెప్పే రాహుల్​ గాంధీ తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్​ చేశారు. బాబా సాహేబ్​ అంబేద్కర్​ ను ఓడించింది నెహ్రూ కుటుంబమేనన్నారు. ఆయన ఆశయాలు, స్థలాలను పవిత్ర క్షేత్రంలా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ అని తెలిపారు. తెలంగాణలో బీఆర్​ ఎస్​ ను ప్రజలు పార్లమెంట్​ ఎన్నికల్లో తరిమికొట్టారని, రానున్న కాలంలో బీజేపీ ఉద్యమకారులు, యువత, ప్రజల ఆకాంక్షలు, ఆశీస్సులతో అధికారంలోకి వస్తుందన్నారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా మోదీ ఆర్థిక క్రమశిక్షణ విధానాలతో దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేశామన్నారు. పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక అగాధంలో కూరుకుపోయాయని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి వివరించారు. 

సికింద్రాబాద్​ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించిన సంధిబోయిన అభిషేక్​ యాదవ్​, ఆనంద్​ కుమార్​ (నందు), నగేష్​, శివ (ముదిరాజ్​), 300మంది యువకులు బీజేపీలో చేరిన సందర్భంగా రాష్ర్ట పార్టీ తరఫున మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ఆదివారం వివిధ పార్టీల నుంచి వీరంతా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. కేంద్రమంత్రి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి మీడియాతో మాట్లాడారు. 

బొమ్మా, బొరుసు పార్టీలు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​..
బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు రెండూ తెలంగాణను ముందుకు తీసుకువెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. తెలంగాణను బొమ్మ, బొరుసలా ఈ రెండు పార్టీలు ఉంటూ తెలంగాణను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే పేకముక్కలా, రాష్ర్టాన్ని దోపిడీ చేస్తున్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వంచిస్తూ, ఉద్యమకారుల ఆత్మలకు ఘోస పెడుతున్నాయని విమర్శించారు. మిగులు నిధులున్న ఉన్న రాష్​ర్టాన్ని అప్పుల అగాధంలోకి నెట్టివేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న పనులకు కూడా జీహెచ్​ ఎంసీ వద్ద నిధులు లేవన్నారు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారన్నారు. వీధి లైట్లను ఏర్పాటు చేసే కార్మికులకు కూడా జీతాలివ్వలేక, వీధుల్లో లైట్లు వెలగడం లేదన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయని, వీరి చేష్ఠలు మాత్రం దరిద్రంగా మారాయన్నారు. ఎక్సైజ్​ డిపార్ట్​ మెంట్​ కు సరఫరా చేసిన లిక్కర్​ కూడా  ప్రజల వద్ద డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మరో దానికి బదిలీ చేసుకుంటున్నాయని దీంతో ఆ సంస్థలు ప్రభుత్వ సంస్థకు లిక్కర్​ ఇవ్వబోమని తేల్చి చెప్పాయన్నారు. 

ప్రజల తరఫున బీజేపీ పోరాటాలు..
సకలజనుల సమ్మెతో సాధించుకున్న తెలంగాణ పూర్తి ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన జరుగుతుందన్నారు. అందుకే గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను బీజేపీని గెలిపించారన్నారు. అందుకే ప్రజల తరఫున పోరాటాలు చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉందన్నారు. బీఆర్​ఎస్​ అవినీతి నుంచి బయటపడే పనిచేస్తుందని, కాంగ్రెస్​ పార్టీలకు బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీ, నష్టాలకు ఈ రెండు పార్టీలే కారణమని కేంద్రమంత్రి మండిపడ్డారు. మోదీ నేతృత్వంలో దేశంలో ఒక్కరూపాయి అవినీతి ఆరోపణలు లేకుండా జవాబుదారీ తనంతో పనిచేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో చిన్నదేశాల నుంచి పెద్ద దేశాల వరకు కూడా ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నారు. కానీ ఈ రోజు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక క్రమశిక్షణతో కరోనా, యుద్ధాలు, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొని సమస్యలు ఉత్పన్నం కానీయకుండా మోద ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. 

డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం రావాలి..
రేపు తెలంగాణ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలనీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆ విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన వస్తుందని తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలన్నారు. ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు పూర్తి వైఫల్యాలు చెందాయన్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలతో ఒకరినొకరు దూషించుకుంటూ సమయాన్ని కాలయాపన చేస్తున్నారని, ఈ రెండు అవినీతి, కుటుంబ పార్టీలేనని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

రాహుల్​ వి సిగ్గులేని మాటలు..
రాహుల్​ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. ఆర్​ఎస్​ఎస్​, బీజేపీతోనే గాకుండా భారత రాజ్యం మీద పోరాటం చేయాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యం మీద పోరాటమంటే రాజ్యాంగంపై పోరాటమేనని తెలుసుకోవాలన్నారు. రాహుల్​ గాంధీ తెలంగాణ హైదరాబాద్​ కు వస్తారని అంటున్నారని ఇక్కడికి వచ్చే నైతిక హక్కు లేదని, రాజ్యాంగాన్ని రక్షిస్తానని, పుస్తకాన్ని వెంట బెట్టుకొని తిరిగారని, వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, సబ్​ గ్యారంటీల హామీల అమలు ఏమైందన్నారు. అమలు చేయకుండా తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణకు వచ్చే ముందు ఆడబిడ్డలకు, తల్లులకు, నెలకు రూ. 2వేలు ఇస్తామని ఇప్పటివరకూ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 

హామీల అమలులో పూర్తిగా విఫలం..
నిరుద్యోగ యువతకు జాబ్​ క్యాలెండర్​ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎక్కడపోయిందని, దొంగ క్యాలెండర్​ అని, అమలులో ప్రజలను, యువతను మోసం చేసిన జాబ్​ క్యాలెండర్​ అని ఎందుకు అమలు చేయలేదో రాహుల్​ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ. 4వేలు ఇస్తామని సోనియా, రాహుల్​ గాంధీ, రేవంత్​ రెడ్డిలు హామీ ఇచ్చారని ఈ గడ్డమీదకు వచ్చే ముందే ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని కేంద్ర మంత్రి నిలదీశారు. మహిళలకు ఆర్థిక సహాయం ఎంతమందికి ఇచ్చారు? దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు? రైతుల భోనస్​ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ధాన్యంపై కూడా సన్నధాన్యం కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పత్తిపై బోనస్​ ఏమైందని ప్రశ్నించారు. రాజ్యాంగం పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్​ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

అంబేద్కర్​ ను అవమాన పరిచింది నెహ్రూ కుటుంబమే..
రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిన వారు కాంగ్రెస్​ పార్టీయే అన్నారు. డా. బాబా సాహెబ్​ అంబేద్కర్​ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన్ను ఓడించింది నెహ్రూ కుటుంబమేనన్నారు. ఆయనపై అనేక కుట్రలు చేసింది ఈ పార్టీయేనన్నారు.  ఆయన చివరి శ్వాస వరకు అవహేళన చేసిన పార్టీ వీరిదన్నారు. అంబేద్కర్​ ను గౌరవించి పార్లమెంట్​ లో చిత్రపటాన్ని, భారతరత్న ఇచ్చిన పార్టీ బీజేపీ అన్నారు. అంబేద్కర్​ జన్మస్థలం, నాగ్​ పూర్​ లో దీక్షా స్థలం, ఢిల్లీలో ఇళ్లు, లండన్​ లోని చదువుకున్న ఇళ్లు, ముంబాయిలో స్థలం పంచతీర్థం పేరుతో నిర్మాణాలు చేపట్టిన పార్టీ బీజేపీ అన్నారు. 

వారిని గౌరవించుకున్నాం..
మీ ముఖాలకెప్పుడైనా మీ కుటుంబాల గురించే మాట్లాడారే తప్పితే అంబేద్కర్​, పటేల్​, పివీ నరసింహారావుల గురించి ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్​ కు ప్రధానిగా సేవలందించిన పీవీ నరసింహరావు స్వర్గస్థులైతే కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో కూడా పెట్టనీయలేదన్నారు. తెలుగుబిడ్డకు తీవ్ర అవమానం చేసిందన్నారు. ముంబాయిలో అంబేద్కర్​, పివీ అంత్యక్రియలు హైదరాబాద్​ లో జరిపారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్​ పెద్ద నాయకుల అంత్యక్రియలు ఢిల్లీలో జరుపుతారని ఇదే వివక్ష అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్​, పీవీ లాంటి వారిని గౌరవించుకున్నామన్నారు. స్థూపాలు, భవనాలు నిర్మాణం చేపట్టామన్నారు. ఢిల్లీలో పీవీ భవన్​ నిర్మించామన్నారు. కాంగ్రెస్​ కు ఎందుకు మనసు రాలేదని నిలదీశారు. అందుకే రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్​ గాంధీకి లేదన్నారు. 

రాజ్యాంగం అమలు 75ఏళ్లు పూర్తి.. ఒక ఏడాదిపాటు రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు..
పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కు ఒక్కసీటు కూడా రాలేదని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునే బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75ఏళ్లు పూర్తయ్యిందన్నారు. ఒక సంవత్సరం పాటు భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ప్రతీ గ్రామానికి ప్రతీ ఇంటికి వెళ్లి చెబుతామన్నారు. కాంగ్రెస్​ పార్టీ భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందో, పత్రికా స్వేచ్ఛను హరించిందో, ఎమర్జెన్సీలో జైళ్లలో పెట్టి రాజ్యాంగాన్ని ఏవిధంగా అపహాస్యం చేసిందో ప్రతీ ఒక్కరికి చెబుతామని అన్నారు. 75 సంవత్సరాల రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను చేపడుతున్నామని తెలంగాణ ప్రజలు, యువత ముందుకు రావాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానీకంపై, పుట్టిన బిడ్డపై కూడా అప్పు ఉందని అన్నారు.