నమీబియా పితామహుడు నుజోమా కన్నుమూత
Namibia's patriarch Nujoma passes away

విండ్ హోక్: నమీబియా వ్యవస్థాపక పితామహుడుగా పేరు గాంచిన సామ్ నుజోమా (95) కన్నుమూశారు. శనివారం ఆయన మృతి చెందినట్లు నమీబియా అధ్యక్ష కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. గత మూడు వారాలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. వర్ణ వివక్షపై అలుపెరుగని పోరాటం చేశాడు. 2005లో నమీబియా పార్లమెంట్ ద్వారా పితామహుడుగా బిరుదును దక్కించుకున్నారు. ఈయన మృతిపై పలు దేశాధ్యక్షులు ఈయన పోరాట పటిమ, నమీబియా అభివృద్ధికి ఈయన తీసుకున్న చర్యలు, పోరాట పటిమ, వర్ణ వివక్ష, రైతుల క్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచం మహోన్నత విప్లవకారులలో ఒక నాయకుడిని కోల్పోయిందన్నారు. నుజోమా 1990 నుంచి 2005 వరకు మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. సమాజంలో అంతా సమభావంతోనే మెలగాలని నుజోమా కృషిచేశారు. 1929లో జన్మించిన ఈయన నమీబియా స్వాతంత్ర్యం కోసం పోరాటాలను చేశాడు. స్వాపో అనే పార్టీలో కీలకంగా ఎదిగి అధికారాన్ని చేపట్టాడు.