కేజ్రీవాల్ పై ఎఫ్ ఐఆర్ నమోదు
పోలీసులకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. 2019లో కోర్టులో దాఖలైన ఫిర్యాదుపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ కు మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, ద్వారక మాజీ కౌన్సిలర్ నితికా శర్మ ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీళ్లందరిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు మార్చి 18లోగా కోర్టు ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.