బస్సు బోల్తా 12 మంది మృతి!
12 people killed in bus overturn!

కేప్ టౌన్: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం హైవేపై బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందగా, 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జోహన్నెస్ బర్గ్ లోని హైవేపై ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రెస్క్యూబృందాలు రంగంలోకి దిగి బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు జోహెన్నెస్ బర్గ్, కాట్లెహాంగ్ నుంచి ప్రయాణికులను తీసుకొని వెళుతుండగా వేగంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.