హక్కుల కోసం బీఎల్​ఎ పోరాటమా?

Is the BLA fighting for rights?

Mar 11, 2025 - 16:52
 0
హక్కుల కోసం బీఎల్​ఎ పోరాటమా?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​–పాక్​ విభజన తరువాత తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని బలూచిస్థాన్​ లోని ప్రజలు డిమాండ్​ చేశారు. కానీ అందుకు పాక్​ ప్రభుత్వం ఒప్పుకోలేదు. బలవంతంగా ఆ ప్రాంతాన్ని పాక్​ లో చేర్చుకుంది. దీంతో బలూచ్​ తిరుగుబాటుకు దిగింది. బలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ 1970లోనే స్థాపించినప్పటికీ, 2000వరకు పెద్దగా ప్రాబల్యం దక్కలేదు. పాక్​, బ్రిటన్​, అమెరికా లాంటి దేశాలు బీఎల్​ ఎను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. 1973లో జుల్ఫీకార్​ అలీ భుట్టో భారత్​, ఇరాక్​, ఆఫ్ఘానిస్థాన్​, రష్​యాలు బీఎల్​ ఎకు మద్ధతు ఇస్తున్నాయని ఆరోపించారు. 2000 సంవత్సరంలో బీఎల్​ ఎ కొత్త రూపును సంతరించుకొని మరోమారు స్వాతంత్ర్యం కోసం పోరాటం, ప్రజా హక్కులను కాపాడేందుకు ఉద్భవించినట్లు ప్రకటించింది. ఆ తరువాతే బీఎల్​ ఎ దాడులు తీవ్రతరం అయ్యాయి. బలూచ్​ వనరులను పాక్​ వినియోగించుకుంటూ తమకు మౌలిక సదుపాయాల కల్పన, హక్కుల కల్పనలో విస్మరిస్తున్నారని ఆరోపిస్తుంది. పైగా తమను రెండో ప్రాధాన్యత అంశంగా చూస్తున్నారని మండిపడుతుంది. ఈ నేపథ్యంలో తరచూ పాక్​ సైన్యం, ప్రాంతాలలో బీఎల్​ ఎ భారీ దాడులకు పాల్పడుతూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటుంది. ఇప్పటికే గ్లోబల్​ టెర్రరిస్ట్​ దేశాల్లో పాక్​ రెండో వరుసలో ఉంది. పాక్​ లోని 90 శాతం ఉగ్ర ఘటనలు ఖైబర్​ ఫంక్తుక్వా, బలూచిస్థాన్​ లోనే జరిగాయి. ఏది ఏమైనా పాక్​ ఉగ్రవాద గ్రూపులకు స్వర్గధామంగా మరోమారు నిలిచింది.