త్వరలో స్టార్ లింక్ ఇంటర్నెట్!
Star Link Internet coming soon!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎయిర్ టెల్–స్పేస్ ఎక్స్ భాగస్వామ్యం కుదిరింది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో త్వరలోనే స్టార్ లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ ను భారత్ కు తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇక భారత ప్రభుత్వ అనుమతే తరువాయి. అనుమతి లభించిన వెంటనే ఒప్పందం ప్రకారం ఇంటర్నెట్ పనులను కొనసాగించనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం స్టార్ లింక్ పరికరాలను ఎయిర్ టెల్ తన స్టోర్లలో విక్రయించనుంది. ఈ పరికరాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా నిరంతరంగా, ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ ఉపగ్రహ ఇంటర్నెట్ ను అందజేస్తుంది.