- భారత్ కు అంబాసిడర్లు ప్రవాసీయులే
- భారతీయుల శక్తియుక్తులను ప్రపంచం విశ్వసిస్తోంది
- అన్ని రంగాల్లో, దేశాల్లో భారతీయులు ముందుకు
- ఏఐ అంటే అమెరికన్ ఇండియన్
- బైడెన్ ఆత్మీయ పిలుపు 140 కోట్ల మందికి దక్కిన గౌరవం
- మూడోసారి మూడురెట్ల వేగంతో పనిచేస్తాం
- స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు
- సమృద్ధ భారత్ కే తన జీవితం అంకితం
- ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నెట్ వర్క్ భారత్ ది
- భారత అభివృద్ధిలో నిరుపేదలు, మహిళలను భాగస్వామ్యం చేశాం
- గ్రీన్ ఎనర్జీకి భారత్ సిద్ధం
- పర్యావరణ హిత ఉత్పత్తులే లక్ష్యం
- జీ–20 లక్ష్యాలను సాధించిన తొలి దేశం భారత్
- బోస్టన్, లాస్ ఏంజెల్స్ లో రెండు కాన్సులెట్ లు
- ప్రవాస భారతీయుల స్వాగతం మరువలేనిది
న్యూ యార్క్: నమస్తే నేషనల్ నుంచి గ్లోబల్ కు మల్టినేషన్ గా రూపొందిందన్నారు. ప్రవాసీయుల ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. తాను సీఎం అయ్యాక ప్రవాస భారతీయులతో సాంకేతికతతో కలిసే ప్రయత్నం చేశానన్నారు. 2014లో మెడిసేన్ స్క్వేర్, 2015 2019లో హూస్టన్, 2023లో వాషింగ్టన్, 2024లో న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో కలవడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం న్యూయార్క్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ప్రతీసారి భారతీయులు గత మోదీ సభ రికార్డులను బద్ధలు కొట్టేలా హాజరవుతారని అన్నారు. భారతీయుల సామర్థ్యాలను పూర్తిగా అర్థం చేసుకొంటానన్నారు. తనవద్ద పదవి లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా ప్రవాస భారతీయుల శక్తియుక్తులను విశ్వసిస్తున్నానని అన్నారు. భారత్ కు బ్రాండ్ అంబాసిడర్లు మీరేనని నమ్ముతున్నట్లు తెలిపారు. అందుకే మీరంతా భారతదేశానికి దూతలుగా ఇక్కడ ఉన్నారని ప్రధాని తెలిపారు. మీరంతా భారత్–అమెరికాను మరింత బలోపేతం చేయడంలో శక్తియుక్తులు వినియోగించారని కొనియాడారు. ఏడు సముద్రాలు దాటి ఇక్కడకు భారతీయులు వచ్చినా భారతీయులను భారత్ కు దూరం చేసే సముద్రమే లేదన్నారు.
భారత్ నేర్పిన విద్యను ఎన్నటికీ మరువలేమన్నారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అందరితో కలిసిపోయి జీవిస్తామన్నారు. ఇది మన సంస్కారమన్నారు. ప్రపంచంలో ఎన్నో భాషలు, ఎన్నో మతాలున్నా భారతీయులు మాత్రం ఒక్కటై ముందుకు వెళుతున్నామని మోదీ అన్నారు. ఇక్కడ ఉన్న వారిలో తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ ఇలా భాషలు వేరైనా మనమతం ఒక్కటే అన్నారు. భావం ఒక్కటే అన్నారు. ఆ భావం భారతీయత అన్నారు. ప్రపంచంతో కలిసి బలపడేందుకు భారతీయుల్లో ఉన్న గొప్ప శక్తి ఇదేనని అన్నారు. దీంతో భారతీయులు విశ్వహిందూగా ముద్రపడ్డారన్నారు. మనం వేరే వారికి మంచి చేసి, త్యాగం చేసి సుఖాన్ని, సంతోషాన్ని పొందుతామన్నారు. అందుకే ప్రపంచదేశాల్లో భారతీయుల పట్ల విశేష గౌరవ, మర్యాదలు లభిస్తాయన్నారు. డాక్టర్లు, వైజ్ఞానికులు, ప్రొఫెషనల్స్ ఇతర రంగాల్లో నిలిచినా మన భారత సంస్కృతి నేర్పిన మంచిని వదలలేదన్నారు.
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏఐ అంటే అమెరికన్ ఇండియన్ అని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఇదే కొత్త ప్రపంచపు ఏఐ పవర్ అన్నారు. ఇదే ఊపు ఇరుదేశాల బంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రవాసభారతీయులందరికీ సెల్యూట్ సమర్పించారు. తాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు గౌరవ మర్యాదలనే వింటానన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కలిసి ఆయన ఇంటికి వెళ్లానన్నారు. ఆయన ఆత్మీయ పిలుపు తన మనసును గెలిచిందన్నారు. ఇది కేవలం తనకు మాత్రమే లభించిన గౌరవం కాదన్నారు. 140 కోట్ల మంది భారతీయులదన్నారు. ఇక్కడ ఉన్న, విచ్చేసిన భారతీయుల పట్ల గౌరవం అన్నారు. ఇందుకు బైడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
2024 పూర్తి ప్రపంచానికి చాలా కీలకమైందన్నారు. ఓ వైపు ప్రపంచంలో కొన్ని దేశాల్లో యుద్ధ మేఘాలు ఉన్నాయన్నారు. మరోవైపు ప్రజాస్వామ్య దేశాలు ఫరిడవిల్లుతున్నాయన్నారు. భారత్–అమెరికాలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలన్నారు. భారత్ లో ఎన్నికలు అయ్యాయని, ఇక అమెరికాలో ఎన్నికలు కానున్నాయన్నారు. భారత్ లో ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలన్నారు. అమెరికా, యూరోప్ లోని పూర్తి జనాభాతో రెండింతలు ఓటర్లు భారత్ లో ఓటు వేశారని ప్రధాని మోదీ తెలిపారు. 10 లక్షల కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లు, 8వేలమంది అభ్యర్థులు, రేడియోలు, పత్రికలు, న్యూస్ ఛానళ్లు, లక్షలాది సోషల్ అకౌంట్లలో ఎక్కడ చూసినా ఎన్నికల మాటలే వినబడ్డాయన్నారు. కానీ ఈ సారి భారత ఎన్నికల్లో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అనే అద్భుతాన్ని చూపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారన్నారు.
మూడోసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇలా 60 సంవత్సరాల్లో భారత్ లో ఎన్నడూ జరగలేదన్నారు. భారత ప్రజలు చాలా ఆలోచించి తమను గెలిపించారన్నారు. ప్రజాస్వామ్యంలో వారి నిర్ణయం చాలా బలోపేతమైందన్నారు. మూడోసారి టెర్మ్ లో మరిన్ని పెద్ద లక్ష్యాలను చేధించే ఆవశ్యకత ఉందని, అభివృద్ధి మూడింతలు వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. పుష్ప అంటే ప్రొగ్రెసివ్ భారత్, అన్ స్టాపబుల్ భారత్, హ్యూమానిట సమర్పిత భారత్, ప్రాస్పరస్ భారత్ అని పుష్ప అని అన్నారు. పుష్పానికి సంబంధించిన ఐదు రెక్కలతో కలుపుకొనే వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతామని అన్నారు. స్వాతంత్ర్యం తరువాత తాను జన్మించానని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహానీయులు తమ హితాన్ని, క్షేమాన్ని కోరలేదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అన్నింటిని వదిలి ఆంగ్లేయులతో పోరాడారన్నారు. ఈ మహా సంగ్రామంలో కొందరు ఉరితాళ్లపై వేలాడితే, మరికొందరు బుల్లెట్లను సహించారన్నారు. కొందరు జైళ్లలో మగ్గారని అన్నారు. ప్రజలారా మనం భారత్ కోసం ఆ మహా పోరాటం చేయలేకపోయామన్నారు. కానీ భారత్ కోసం జీవిద్దామని అన్నారు. చావడం మనచేతుల్లో లేదని, కానీ జీవితం మన చేతుల్లోనే ఉందన్నారు. తాను స్వరాజ్యం కోసం జీవితాన్ని ఇవ్వలేకపోయానన్నారు. కానీ సమృద్ధ భారత్ కోసం జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తన జీవితంలో ఎంతోకాలం దేశమంతా తిరిగానన్నారు. ఎక్కడైతే తిండి దొరికితే అక్కడే తిన్నానని, ఎక్కడైతే నిద్దుర వస్తే అక్కడే నిద్దుర పోయానన్నారు. కానీ భారత జీవనం, సంస్కృతి మూలాలను మాత్రం మరవలేదన్నారు. తాను ఆ రోజుల్లో ఒక్కటి తలిచానని, కానీ విధి తనను రాజకీయ నాయకుడిగా చేసి మీ ముందు నిలబెట్టిందన్నారు. 13యేళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నానని ఆ తరువాత ప్రజలు తనకు ప్రమోషన్ ఇచ్చి పీఎంను చేశారన్నారు. పీఎం అయ్యాక దేశ, విదేశాల్లో మూలమూలలకు వెళ్లి చాలా నేర్చుకున్నానని అన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వ విజయాన్ని ప్రపంచం చూసిందన్నారు. అత్యంత విశ్వసనీయత, నమ్మకాలతోనే భారత ప్రజలు తనను మరోమారు ఎన్నుకున్నారన్నారు. ఈ మూడోసారి మూడువంతుల రెట్ల వేగంతో పనిచేస్తానన్నారు. ఈరోజు భారత్ ప్రపంచంలోకెల్లా అత్యంత యువకులు ఉన్న దేశమన్నారు. ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు యువతలో ఉన్నాయన్నారు. చెస్ ఒలింపియాడ్ లో మెన్స్, వుమెన్స్ రెండింటిలో భారత్ కు స్వర్ణం లభించిందని తెలిసిందన్నారు. వందేళ్లలో చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి భారత్ గెలిచిందన్నారు. ఏఐ అస్పిరేషనల్ ఇండియా అన్నారు. కోట్లాది మంది యువత కళలు భారత్ ను అభివృద్ధి వైపు తీసుకువెళుతున్నారన్నారు. కొత్త కొత్త సాంకేతికతను వికసింప చేస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో భారత్ 10వ స్థానం నుంచి ఐదో స్థానంలో ఎకానమీకి ఎదగగలిగామని మోదీ అన్నారు. ప్రస్తుతం తమముందున్న లక్ష్యం ఎకనామీలో మూడోస్థానానికి రావాలన్నదే తమ అభిమతం అన్నారు.
గత పదేళ్లలో భారత్ లో కోట్లాది మందికి గ్యాస్, నీరు, విద్యుత్, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు అందాయన్నారు. ఇలా ఎంతోమంది నాణ్యమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నారన్నారు. ఇప్పుడు భారతీయులకు కేవలం రోడ్లు కాదని ఎక్స్ ప్రెస్ హైవేలు కావాలని, హైస్పీడ్ ట్రైన్ లు కావాలని అన్నారు. ప్రతీ భారత నగరానికి మెట్రో రావాలని కోరుకుంటున్నాయని, ఏయిర్ పోర్టులు కావాలని కోరుకుంటున్నాయని తెలిపారు. ప్రతీ గ్రామంలో ప్రపంచంలోని అత్యుత్తమ సేవలు తమకూ లభించాలని ఆశిస్తున్నారని తెలిపారు. ఈ రోజు 23 నగరాల్లో మెట్రో ఉందన్నారు. ప్రపంచంలోని రెండో పెద్ద మెట్రో నెట్ వర్క్ భారత్ లో ఉందన్నారు. 2014లో 70 నగరాల్లో ఏయిర్ పోర్టులు ఉండేవన్నారు. ఈ రోజు 140కిపైగా నగరాల్లో ఏయిర్ పోర్టులు ఏర్పాటు చేశామన్నారు. 2014లో వంద గ్రామపంచాయితీల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉండేదన్నారు. కానీ నేడు రెండు లక్షలకు పైగా గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లుండగా, ప్రస్తుతం 36 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయన్నారు. గతంలో ఏదైనా పనిచేయాలంటే ఏళ్లు గడిచిపోయేవని కానీ నేడు నెలల్లోనే ఆ పనులు పూర్తి చేస్తున్నామని మోదీ తెలిపారు.
భారత్ అభివృద్ధి ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం ఏర్పడిందన్నారు. అభివృద్ధికి భారత్ పార్టనర్ గా నిలుస్తుందన్నారు. ప్రపంచానికి భారత పనితీరుపట్ల నమ్మకం, విశ్వాసాలు ఏర్పడ్డాయన్నారు. భారత్ లో కావాల్సినంత భూమి, వనరులున్నాయని అన్నారు. ఇప్పుడు భారత్ అవసరాల కోసం వేచి ఉండదని, అవసరాలు భారత్ కోసం వేచి ఉండాలని అన్నారు. కేవలం ఒక దశకంలోనే (10యేళ్ల)లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. ఇది భారత్ కు గర్వకారణమన్నారు. ఇదేలా సాధ్యపడిందని ప్రశ్నించారు. పాత ఆలోచనలు మార్చామని అందుకే ఇది సాధ్యమైందన్నారు. నిరుపేదకు ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. నిరుపేదలను బ్యాంకింగ్ రంగం నుంచి కలిపామన్నారు. ఐదు లక్షల మందికి ఉచిత వైద్యం, నాలుగు కోట్ల మందికి ఉచిత గృహాలు అందించామన్నారు. కోట్లాది మందిని వ్యాపార రంగంలో సమృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఆ నిరుపేదలే పేదరికాన్ని జయించారన్నారు. నేడు వారే భారత్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతున్నారని తెలిపారు.
మహిళా శక్తి ద్వారా కూడా వారి అభివృద్ధికి కృషి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్లన్నీ మహిళల పేరుతో ఇచ్చామన్నారు. బ్యాంకు అకౌంట్లు సగం కంటే ఎక్కువ మహిళలే తెరిచారన్నారు. 10 కోట్ల మంది మహిళలు మైక్రో ఎంటర్ ప్రెన్యూర్ పథకంతో జోడింప బడ్డారని తెలిపారు. భారత్ లో వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం భారత్ వ్యవసాయంలో పొలాల్లో డ్రోన్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ డ్రోన్లను రూరల్ మహిళలే నడిపిస్తున్నారని తెలిపారు. అగ్రికల్చరల్ లో ఆ సాంకేతికతను గ్రామ మహిళలే తీసుకువస్తున్నారన్నారు. ఈ రోజు 5జీ మార్కెట్ భారత్ లో అమెరికా కంటే ముందుకు వెళ్లిందన్నారు. ఇది కేవలం రెండేళ్లలోనే సాధించగలిగామన్నారు. ఈ సెక్టార్లను ముందుకు తీసుకువెళ్లేందుకు మేడిన్ ఇండియా టెక్నాలజీ కోసం పనిచేశామన్నారు. ఉత్పత్తి రంగాలపై ఫోకస్ చేశామన్నారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువగా మొబైల్ బ్రాండ్లు మెడిన్ ఇండియావే అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి భారత్ లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఒక సమయంలో మొబైళ్ల దిగుమతుల నుంచి ప్రస్తుతం మొబైళ్లను ఎగుమతులు చేసే వరకు ఎదిగామన్నారు. భారత్ ఇక వెను దిరిగి చూడదన్నారు. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ద్వారా లావాదేవీలు పెరగడం, అవినీతి అంతం చేయగలిగామన్నారు. భారత యూపీఐ పెమెంట్లు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు.
సెమీకండక్టర్ రంగంలో కూడా ముందడుగు వేసి ఐదు యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. మేడ్ ఇన్ ఇండియా చిప్ లు అమెరికాలో కూడా త్వరలోనే చూస్తారని అన్నారు. ఈ చిన్న సెమీకండక్టర్ రంగం భారత్ ను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళుతుందని ఇదే మోదీ గ్యారంటీ అని ప్రధాని తెలిపారు. అభివృద్ధి కోసం గ్రీన్ ఎనర్జీ కూడా కీలక భూమిక పోషిస్తుందన్నారు. గ్లోబల్ కార్బన్ కమిషన్ లో భారత్ భాగస్వామ్యం కేవలం 4 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రపంచాన్ని నాశనం చేయడం అనేది భారత ఉద్దేశ్యం కాదన్నారు. పర్యావరణ హిత కార్యకలాపాలే తమ లక్ష్యమన్నారు. తాము గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని ఎన్నుకున్నామన్నారు. ప్రకృతిని కాపాడే నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకే సోలార్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని మోదీ తెలిపారు.
జీ–20దేశాల నిర్ణయంలో క్లైమెట్ కు సంబంధించి నిర్ణయాలను తొలిసారిగా భారత్ సాధించిందన్నారు. ప్రతీ ఇంటిలో సోలార్ పవర్ గా రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం రూఫ్ టాఫ్ నిర్ణయం తీసుకున్నామన్నారు. రైల్వేస్టేషన్లు, గ్రామాలు, రోడ్లు, ఇళ్లు, బస్ స్టేషన్లను సొలార్ పవర్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 21వ శతాబ్ధపు భారత్ విద్య, సాంకేతికత, స్కిల్స్ తో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే నలంద యూనివర్సిటీని పునర్ నిర్మాణం చేపట్టామన్నారు. గత పదేళ్లలో భారత్ లో యూనివర్సిటీలు, ఐఐటీలు 9 నుంచి 25కు పెరిగాయన్నారు. ఏయిమ్స్ లాంటి మెడికల్ కళాశాలలో వృద్ధి నమోదైందన్నారు. ఏడు గ్లోబల్ యూనివర్సిటీలు కూడా రూపుదిద్దుకున్నాయన్నారు. కాలేజీల సంఖ్య రెండింతలుగా పెంచామన్నారు.
నేడు భారత్ చెబితే ప్రపంచం వినేలా తాము పనిచేశామన్నారు. కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపించామన్నారు. భూకంపాలు, తుపానులు, యుద్ధాలలో ఉన్న వారికి సహాయం చేసేందుకు ముందువరుసలో భారత్ ఉంటుందన్నారు. ఇదే భారత్ సంస్కారం అన్నారు. నేటి భారత్ ఎంత ఎత్తుకు ఎదిగినా తమ మూలాలను, సంస్కృతి, సాంప్రదాయాలను మరిచిపోదన్నారు. గ్లోబల్ పీస్, క్లైమెట్, స్కిల్స్ గ్యాప్ దూరం చేయడంలో, ఇన్నోవేషన్ లో కొత్త మార్గాన్ని నిర్దేశించడంలో, సప్లై చెయిన్ లో సుస్తిరతల కోసం భారత్ కీలకంగా నిలుస్తుందన్నారు. తాము సూర్యుని కిరణం మాదిరి ప్రపంచానికి వెలుగునిచ్చే భారతీయులమన్నారు. తాము విశ్వం అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని పెంచుతామన్నారు. భారత్ జీడీపీ సెంట్రీ గ్రోత్ తోపాటు హ్యూమన్ గ్రోత్ కు కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. తమ తమ లఫ్ స్టైల్ లో కొద్ది మార్పు చేసి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక్ పేడ్ మాకే నామ్ ద్వారా భారత్ లో పర్యావరణాన్ని పెంపొందించగలుగుతున్నామన్నారు. ఈ రోజు భారత్ పెద్ద కలలు కంటుందని, వాటిని నెరవేరుస్తుందని అన్నారు.
త్వరలో భారత్ లో కూడా ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నాన్ని చేస్తున్నామన్నారు. ఈ రోజు భారత్ అతిపెద్ద ఆకర్షణ కేంద్రంగా నిలుస్తోందన్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ లీడ్ అన్నారు. పర్యాటక రంగంలో కూడా తమ సత్తా చాటుతున్నామన్నారు. వివిధ దేశాల్లో భారత పర్వదినాలు నిర్వహించుకోవడం పెరిగిందన్నారు. ప్రతీదేశం భారత్ కు ఎక్కువ సమయం ఇవ్వాలని, తెలుసుకోవాలని అనుకుంటోందన్నారు. అమెరికా 300 విగ్రహాలను భారత్ కు అప్పగించిందన్నారు. ఇప్పటివరకు 500కు పైగా విగ్రహాలను అమెరికా అప్పజెప్పిందన్నారు. ఇదేం చిన్న విషయం కాదన్నారు. ఇది మన చరిత్రకు అమెరికా ఇచ్చిన గౌరవం, మర్యాద అన్నారు. ఇది భారత్ కు భారతీయులకు ఇచ్చిన గౌరవం అన్నారు. ఇందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు.
భారత్–అమెరికాలు ప్రతీ క్షేత్రంలో బంధాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రవాస భారతీయుల క్షేమం కూడా దృష్టిలో ఉందన్నారు. మరో రెండు కాన్సులెట్ లను బోస్టన్, లాస్ ఏంజెల్స్ లో తెరవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో తిరువళ్లూవర్ తమిళ చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. ప్రవాస భారతీయుల స్వాగతం మరువలేనిదన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక, కళారూప కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రవాస భారతీయులంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.