మోదీ విధానం సరైందే! ఎంపీ శశిథరూర్
Modi's policy is right! MP Shashi Tharoor

నా తెలంగాణ, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానం సరైందేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ శశిథరూర్ తొలిసారిగా ప్రధాని నిర్ణయాలను ఆకాశానికెత్తారు. మంగళవారం మీడియాతో శశిథరూర్ మాట్లాడారు. మోదీ తన అభిప్రాయాలను ధృఢంగా ఉంచుతూ ముందుకు వెళతారని కొనియాడారు. పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత విదేశాంగ విధానం సరైందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. 26/11 ముంబాయి దాడులు, 2016 పఠాన్ కోట్ దాడులు దేశంపై జరిగిన దాడులుగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. పాక్ తో చర్చలు దాదాపు అసాధ్యమేనన్నారు. ఇరుదేశాల పరస్పర బంధాలను పాక్ చేజేతులా చెడగొట్టుకుందన్నారు. తాను ఎప్పటికీ శాంతికి మద్ధతునిస్తానని అన్నారు. అమెరికా నుంచి ప్రవాస భారతీయులను వెనక్కిపంపడంపై మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన విధానమని, ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ విషయంపై భారత్ ఆచీతూచీ అడుగువేస్తుందని ఆశిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు.