సీఎం బీరేన్ సింగ్ రాజీనామా!
CM Biren Singh's resignation!

ఇంఫాల్: మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైన ఆయన సాయంత్రానికి మణిపూర్ తిరిగి వచ్చి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించారు. రాజీనామా సమర్పించే సమయంలో బీజేపీ ఎంఈ సంబిత్ పాత్ర, ఇతర రాష్ర్ట మంత్రులు కూడా బీరేన్ సింగ్ తో ఉన్నారు. మణిపూర్ శాంతిభద్రతలపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే రెండు, మూడుసార్లు ఈ పరిస్థితులను, ఆవేదనను వ్యక్తం చేస్తూ రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. ఇప్పటికైనా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రాజీనామా లేఖలో మణిపూర్ సమగ్రత, భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐదు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. రాష్ర్ట భద్రతకు బయోమెట్రిక్ లాంటి కఠిన విధానాన్ని అవలంభించాలని, చొరబాట్లను ఆపాలని, అక్రమ వలసలను నిరోధించాలని ఎంఎఫ్ ఆర్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రానికి బీరేన్ సింగ్ విజ్ఞప్తి చేశారు.