యూఎస్​ఎఐడీ బ్రెయిన్​ వాష్​

USAID brainwash

Feb 11, 2025 - 11:45
 0
యూఎస్​ఎఐడీ బ్రెయిన్​ వాష్​

కుట్రను బయటపెట్టిన వికిలీక్స్​
తెరవెనుక యూఎస్​ హస్తం!
ఇప్పటికే 75వేలమంది జర్నలిస్టులకు శిక్షణ
వీరి ద్వారా వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించే యత్నం
ప్రపంచవ్యాప్తంగా 4000 అవుట్​ లెట్​ లు
భారత్​ లో భాగస్వామి డేటాలీడ్స్​
సోరోస్​ సంస్థలో సభ్యుడు సయ్యద్​ నజకత్​
పాలంపూర్​ లో ప్రశాంత్​ భూషణ్​ అనుబంధ ఇన్​ స్టిట్యూట్​లో శిక్షణ

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: జర్నలిజం ముసుగులో ప్రపంచంలోని పలు దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే భారీ కుట్రను వికిలీక్స్​ బహిర్గతం చేసింది. వామపక్ష భావజాలంతో యూఎస్​ ఈ కుట్రలకు తెరతీసింది. యూఎస్​ ఎఐడీ (యూనైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అమెరికా ఇంటర్నేషనల్​ డెవలప్​ మెంట్​) పేరుతో 75వేల మంది పాత్రికేయులకు శిక్షణ ఇచ్చి వీరి ద్వారా ఆయా దేశాల్లోని ప్రజలను వామపక్ష భావాజాలంలోకి నెట్టే ప్రయత్నాలకు తెరతీసింది.  దేశ ప్రజలను తప్పుదోవ పట్టేంచే, వారిని బ్రెయిన్​ వాష్​ చేసే కుతంత్రాలకు అంకురార్పణ చేసింది. తెరముందు యూఎస్​ కనిపించపోయినా వామపక్షజాలం అనువణువునా జీర్ణించుకున్న జార్జ్​ సోరోస్​, ఇతర సంస్థల ముసుగుల్లో ఈ ప్రయత్నాలు జరిగాయి. దీంతో భారత్​ సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజల మనోభావాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వికిలీక్స్​ ప్రకారం వందలాది దేశాల్లో నాలుగు వేల ఔట్​ లెట్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి భారత్​ లోనూ ఉంది. యూఎస్​ ఏం చేసినా అదే కరెక్ట్ అనే భావజాలాన్ని ఈ అవుట్​ లెట్​ లు జర్నలిస్టుల ద్వారా ముందే ప్రజల మనస్సుల్లో నాటువేయడమే వీరి పని. దీంతో అమెరికా చేయబోయే ప్రతీ పని ప్రపంచదేశాలకు మంచిగా కనబడడం, నిజమే అన్న భావనను కలిగిస్తుంది. 1982లో డేవిడ్​ హాఫ్మన్​ జర్నలిస్ట్​ శిక్షణ ముసుగులో అవుట్​ లెట్​ ను ప్రారంభించారు. ఈయన ప్రారంభించిన సంస్థ వెనుక యూఎస్​ ఎఐడీ ప్రమేయాన్ని కనబడనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సంస్థ వెనుక యూఎస్​ ఉందని ప్రపంచానికి తెలియకూడదనే కుతంత్రం ఇందులో దాగి ఉంది. 

భారత్​ లో ఢిల్లీకి చెందిన డేటాలీడ్స్​ భాగస్వామి. డేటాలీడ్స్​ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్​ శాల పేరుతో శిక్షణనిస్తుంది. డేటాలీడ్స్​ ను జర్నలిస్ట్​ సయ్యద్​ నజకత్ స్థాపించాడు. ఇతను​ ఫోర్డ్​, సోరోస్​ నిధులతో నడిచే జర్నలిస్ట్ గ్రూపులైన గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్ వర్క్ బోర్డు సభ్యుడు కావడం విశేషం. ఈ సంస్థకు అనుబంధంగా ప్రశాంత్​ భూషణ్​ అనే సీనియర్​ జర్నలిస్ట్​ సంభావనా ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ పాలసీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంటారు. ఈ సంస్థ హిమాచల్​ పాలంపూర్​ లో శిక్షణా కేంద్రం ఉంది. ఫ్యాక్ట్​ శాల సయ్యద్​ నజకత్​ తో ఈ ఇన్​ స్టిట్యూట్​ కు ఎనలేని అనుబంధం ఉంది. ఈ సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 2500 వర్క్​ షాప్​ లు నిర్వహించారు. 75వేల మంది విలేఖరులకు శిక్షణ ఇచ్చారు. వీరి ఫాలోవర్ల సంఖ్య 6.5 కోట్లకు చేరుకోవడం విశేషం. వీరి ప్రొఫైల్​ లను వీక్షిస్తే వందలాది మంది పాత్రికేయులు కనిపిస్తారు. అంటే ఎంతపెద్ద ఎత్తున వామపక్ష జాలాన్ని భారత్​ లోనూ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారనేది బహిర్గతం అవుతుంది. ఈ సంస్థలకు కావాల్సిన సొమ్మంతా యూఎస్​ఎఐడీ (యూఎస్​–జార్జ్​ సోరెస్​)ల నుంచే పరోక్షంగా అందుతుంది.